వికారాబాద్ : వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ కుమారుడు కౌశిక్ జన్మదినం సందర్భంగా ఆదివారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు అన్నదానం చేశారు. వివిధ రకాల వంటకాలతో పారిశుధ్య కార్మికులకు కడుపునిండ భోజనం పెట్టి, కుటుంబ సభ్యులు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మున్సిపల్ కార్మికులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేష్కుమార్లు ఎస్పీ నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్పీ నారాయణను ఘనంగా సన్మానించారు. దీంతో పారిశుధ్య కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.