వ్యవసాయ రుణమాఫీ షురూ

- నేరుగా రైతుల ఖాతాల్లోనే రుణమాఫీ నగదు జమ
- మేడ్చల్ జిల్లాలో 2,020 మంది రైతులకు లబ్ధి
మేడ్చల్, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 వేల లోపు వ్యవసాయ రుణమాఫీ నగదు సోమవారం రైతుల ఖాతాల్లో నేరుగా జమ అయ్యాయి. దశలవారీగా రైతుల రుణమాఫీ నగదు వారి ఖాతాల్లోనే జమ కానున్నది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా రూ. 50 వేల రుణ మాఫీ జాబితాలో 2,020 మంది లబ్ధిదారులు ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ. 6 కోట్ల 99 లక్షలు మంజూరు చేసింది. దీంతో రైతు రుణ మాఫీ ప్రారంభమైంది. మొదటి విడత రూ. 25 వేల రుణమాఫీలో జిల్లా వ్యాప్తంగా 1339 మంది రైతులు లబ్ధి పొందిన విషయం విధితమే. రెండో విడతలో.. రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో నగదు జమతో రైతులు రుణ విముక్తులయ్యారు. రుణమాఫీ అయిన రైతులు కొత్తగా పంట రుణాలు పొందే అవకాశం ఉంది.
దశలవారీగా వ్యవసాయ రుణమాఫీ
రూ. 50 వేల వ్యవసాయ రుణ మాఫీ దశలవారీగా కొనసాగుతున్నది. రైతుల ఖాతాల్లో నేరుగా రుణ మాఫీ నగదు జమ కానున్నది. ఈ నెలాఖరులోపు రుణమాఫీ పూర్తి చేయనున్నారు. రుణాలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుంది. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -మేరీ రేఖ, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యవసాయాధికారి
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- agriculture loan
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

