Adibhatla | ఆదిభట్లలో రోడ్లపై యదేచ్ఛగా రేకుల షెడ్ దుకాణాలు.. పట్టించుకునే నాథుడే కరువు..!
Adibhatla | ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో రోడ్లపై అక్రమంగా రేకుల షెడ్ దుకాణాలు వెలుస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడని స్థానికులు చెబుతున్నారు.
Adibhatla | ఆదిభట్ల, ఫిబ్రవరి 13: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ముఖ్య కూడళ్ళు, ప్రధాన రోడ్లపై కొందరు వ్యక్తులు ఎక్కడబడితే అక్కడ రేకుల షెడ్లతో షాపులు నిర్మిస్తున్నారు. వాటికి స్థానిక మున్సిపాలిటీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోవడం లేదు. చకచకా నిర్మాణాలు చేపట్టి దుకాణాల కోసం కిరాయికిచ్చి రూ. లక్షల్లో పోగు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టడంతో మున్సిపల్ ఆదాయానికి ఏటా రూ.లక్షల్లో గండిపడుతుందని విమర్శలు వినిపిస్తున్నారు.
కొన్నేండ్లుగా అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న ఆదిభట్ల మున్సిపాలిటీ నాలువైపులా విస్తరించి ఎన్నో కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. తొమ్మిది విలీన గ్రామాలతోపాటు మున్సిపాలిటీలోని ప్రతి గ్రామానికి రవాణాతోపాటు వ్యాపార సౌకర్యాలు పెరిగాయి. దీన్ని అదునుగా చేసుకుని ముఖ్య కూడళ్లతోపాటు ప్రధాన రోడ్ల వెంట కొందరు భవన యజమానులు.. మున్సిపల్ అధికారుల నుంచి ఏ అనుమతి లేకుండా రేకుల పెడ్లకు షట్టర్లు బిగించి వందల షాపులను పక్కాగా నిర్మిస్తున్నారు.
కలెక్టరేట్ చుట్టూ ఇష్టారాజ్యంగా రేకుల షెడ్ దుకాణాలు
మున్సిపాలిటీ లోని కొంగరకలాన్ గ్రామంలో నూతన కలెక్టరేట్‌తోపాటు ఫాక్స్ కాన్, కేన్స్ కంపెనీలతో ఏర్పాటు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు గిరాకీ బాగా పెరిగింది. మంగళ్ పెళ్లి చౌరస్తాతోపాటు బొంగులూరు నాగార్జునసాగర్ హైవేపై ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు వంద షాపులు వెలిశాయి. ఆదిభట్ల సమీపంలోని టీసీఎస్ సమీపంలో వందల సంఖ్యలో ఎలాంటి అనుమతులు లేకుండా రేకుల షెడ్డుతో షట్టర్లు వేసి షాపులు మెయిన్ రోడ్డుపై దర్శనమిస్తున్నాయి.
మున్సిపల్ పరిధిలోని గ్రామాల్లోనూ ప్రధాన రహదారుల వెంట రేకుల పైకప్పుతో పక్కాగా షాపులను నిర్మించి కిరాయికి ఇచ్చి నెలకు కనిష్టంగా రూ.5,000- రూ10,000 మధ్య కిరాయిలు వసూలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ వెలుస్తున్న రేకుల షెడ్లలో వ్యాపార, వాణిజ్య లావాదేవీలు యదేచ్చగా కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలతో మున్సిపాలిటీకి ఆస్తి పన్ను సున్నా
అక్రమంగా నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ దుకాణ సముదాయాల నుండి మున్సిపాలిటీకి ఏ మాత్రం ఆస్తి పన్ను రావడం లేదు. ముఖ్యంగా వీటిని కట్టడి చేయడానికి టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాఖలాలు లేవన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఆదిభట్ల మున్సిపాలిటీ భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. వాస్తవానికి మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు (రెసిడెన్షియల్), దుకాణాలు( కమర్షియల్) నిర్మించే ముందు స్థలం యజమాని అన్ని ధృవపత్రాలు సమర్పించి మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి పొందాకే నిర్మాణం చేపట్టాలి. నిర్మాణం పూర్తయ్యాక డోర్ నెంబర్ తో పాటు అసెస్ మెంట్ చేసుకొని ఏటా ఆస్తి పన్ను చెల్లించాలి.
తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాం
ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మున్సిపాలిటీలోని అక్రమ షెడ్ల నిర్మాణంపై తనిఖీలు నిర్వహిస్తాం. ఎక్కడికక్కడ రేకుల షాప్‌లు నిర్వహించిన వారి వివరాలను, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రేకుల షెడ్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఆస్తి పన్ను చెల్లించాలని బాధ్యులకు నోటీసులు జారీ చేస్తాం. అప్పటికి స్పందించకపోతే తగు చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

