ఎలక్ట్రానిక్ హబ్ @కొంగరకలాన్
రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ ఎలక్ట్రానిక్ హబ్‌గా మారనున్నది. కలెక్టరేట్ సమీపంలో ఇప్పటికే చైనాకు చెందిన ప్రతినిధులు రూ.4,634కోట్లతో ఫాక్స్‌కాన్ సంస్థను ఏర్పాటు చేయగా, రూ.3000కోట్ల పెట్టుబడితో బెంగళూరుకు చెందిన పారిశ్రామిక వేత్తలు కేన్స్ సెమికాన్ అనే మరో ఎలక్ట్రానిక్ సంస్థను ప్రారంభించారు.
- రంగారెడ్డి జిల్లాకు మరో ఎలక్ట్రానిక్ పరిశ్రమ
- ఫాక్స్‌కాన్ తరహాలో కొంగరకలాన్‌లో కేన్స్ సెమికాన్
- రూ.3000కోట్లతో స్థాపించనున్న కంపెనీ
- త్వరలో ఎలిమినేడులోనూ మరో పరిశ్రమ
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 24 : రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ ఎలక్ట్రానిక్ హబ్‌గా మారనున్నది. కలెక్టరేట్ సమీపంలో ఇప్పటికే చైనాకు చెందిన ప్రతినిధులు రూ.4,634కోట్లతో ఫాక్స్‌కాన్ సంస్థను ఏర్పాటు చేయగా, రూ.3000కోట్ల పెట్టుబడితో బెంగళూరుకు చెందిన పారిశ్రామిక వేత్తలు కేన్స్ సెమికాన్ అనే మరో ఎలక్ట్రానిక్ సంస్థను ప్రారంభించారు. మంగళవారం టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, రాచకొండ పోలీసు కమిషనర్ దేవేంద్రసింగ్చౌహాన్తో కలిసి భూమిపూజ చేశారు. త్వరలోనే ఎలిమినేడులోనూ మరో ఎలక్ట్రానిక్ సంస్థ ఏర్పాటు కానున్నది. కేన్స్ సెమికాన్ పరిశ్రమలో అనేకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయనున్నారు. ఇప్పటికే కంపెనీల ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుండగా, కేన్స్ సెమికాన్లో వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రంగారెడ్డిజిల్లా కొంగరకలాన్ భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ హబ్‌గా మారనున్నది. కొంగరకలాన్‌లోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఇప్పటికే చైనాకు చెందిన ప్రతినిధులు రూ.4,634కోట్లతో ఫాక్స్‌కాన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పరిశ్రమల పనులు చకచకా సాగుతున్నాయి. 2024 మే లో ఉత్పత్తులు ప్రారంభించాలనే పట్టుదలతో పనులు చేపడుతున్నారు. ఈ పరిశ్రమకు అతిసమీపంలోనే బెంగళూరుకు చెందిన పారిశ్రామిక వేత్తలు కేన్స్ సెమికాన్ అనే మరో ఎలక్ట్రానిక్ సంస్థను ప్రారంభించారు. సుమారు రూ.3000కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, రాచకొండ పోలీసు కమిషనర్ దేవేంద్రసింగ్‌చౌహాన్ కలిసి మంగళవారం భూమిపూజ చేశారు. దీంతో కొంగరకలాన్‌లో రెండు ప్రముఖ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. ఫాక్స్‌కాన్ కంపెనీలో ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు లక్షమంది ఉపాధి పొందే అవకాశాలుండగా… కేన్స్ సెమికాన్లో వెయ్యిమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే, త్వరలోనే ఎలిమినేడు గ్రామంలో కూడా మరో ఎలక్ట్రానిక్ కంపెనీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే టీఎస్ఐఐసీ ద్వారా భూసేకరణ చేపట్టింది. త్వరలోనే ఎలిమినేడులో కూడా మరో ఎలక్ట్రానిక్ సంస్థ ఏర్పాటు కానుంది. కేన్స్ సెమికాన్ పరిశ్రమలో అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల పరికరాలను తయారుచేయనున్నారు.
ఎలక్ట్రానిక్ రంగంలో కొత్తపుంతలు
ఎలక్ట్రానిక్ రంగం కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆయా పరికరాలకు ఉపయోగించే అతి ముఖ్యమైన పరికరాలను ఇక్కడ తయారుచేయనున్నారు. ఫాక్స్‌కాన్‌లో సెల్ఫోన్లు తయారు చేయనుండగా.. కేన్స్ సెమికాన్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లతో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉపయోగించే అతిముఖ్యమైన సెమి కండక్టర్స్‌ను ఇందులో తయారు చేయనున్నారు. ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పెట్టుబడిదారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఇతర దేశాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా కొంగరకలాన్ సమీపంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐపాస్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నవారికి వారంరోజుల్లో అనుమతులు జారీచేస్తున్నది. అలాగే, పెట్టుబడిదారులకు భూమి, విద్యుత్, నీరు వంటి ముఖ్యమైన సదుపాయాలను కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. అలాగే, పెట్టుబడిదారులు దర్జాగా తమ వ్యాపారాలు చేపట్టడానికి అవసరమైన భద్రతను కూడా తెలంగాణ పోలీసులు కల్పిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి మరికొంతమంది పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

