5,180 కేజీల నల్ల బెల్లం పట్టివేత
నాటుసారా తయారీకి వినియోగించే 5,180 కేజీల నల్ల బెల్లాన్ని కర్ణాటక రాష్ట్రం నుంచి వికారాబాద్ జిల్లాకు తరలిస్తుండగా డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు మెరుపుదాడి చేసి మంగళవారం పట్టుకున్నారు.
- దాని విలువ రూ.4,14,000
- ముగ్గురు నిందితుల అరెస్టు, వాహనం సీజ్
- కర్ణాటకలో తక్కువకు కొని ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయం
- వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ భాస్కర్ గౌడ్
పెద్దేముల్, జూలై 23 : నాటుసారా తయారీకి వినియోగించే 5,180 కేజీల నల్ల బెల్లాన్ని కర్ణాటక రాష్ట్రం నుంచి వికారాబాద్ జిల్లాకు తరలిస్తుండగా డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు మెరుపుదాడి చేసి మంగళవారం పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని కుంచారం నుంచి ముగ్గురు వ్యక్తులు ఓ వాహనంలో నాటుసారా తయారీకి అవసరమైన నల్ల బెల్లాన్ని వికారాబాద్ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు ఓమ్లానాయక్తండా శివారులో మెరుపుదాడి చేసి ఆ వాహనాన్ని పట్టుకున్నారు.
నల్లబెల్లం సుమారు 5180 కేజీలు ఉంటుందని.. బెల్లంతోపాటు నాటుసారా లిక్కర్నూ స్వాధీనం చేసుకున్నారన్నారు. ముగ్గురు వ్య క్తులు కర్ణాటకలో నల్లబెల్లాన్ని రూ.40 కిలో చొప్పున కొని దానిని తెలంగాణలో రూ.60 నుంచి రూ.100 వంద వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించామని.. పట్టుబడ్డ నల్ల బెల్లం విలువ సుమారు రూ.4,14,000 వరకు ఉంటుందన్నారు. వాహనాన్ని సీజ్ చేసి.. నిందితులు రాథోడ్ పాండూనాయక్, రాథోడ్ ఓంసింగ్, రాథోడ్ సచిన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. పాండూనాయక్ గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు రికార్డుల్లో ఉందన్నారు. ఈ దాడుల్లో జిల్లా డీటీఎఫ్ ఎస్ఐ ప్రేమ్‌కుమార్, ఏఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి, తాండూరు సీఐ గంగాధర్, సిబ్బంది విష్ణు, హన్మంతు, శివ, రవికుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

