నిజమైన ప్రేమ అజరామరమైనది.అది ఎప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుందన్నమాట తప్పని రుజువౌతోందా? అంటే అవుననే నిరూపిస్తున్నాయి ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు.గత కొన్నాళ్లుగా మనదేశంలో ప్రేమికుల చేతుల్లో ముక్కలు,ముక్కలుగా నరకబడుతున్న ప్రియురాండ్ల శరీర భాగాలు దీన్నే నిరూపిస్తున్నాయి. ప్రేమ తమకు దక్కనప్పుడు త్యాగాన్ని కాదు..ద్వేషపు విషాన్ని విరజిమ్ముతున్న వైనం ఆందోళన కలిగిస్తున్నది.
గతేడాది నవంబరులో ఢిల్లీలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుందాం. శ్రద్ధావాకర్, ఆఫ్తాబ్ ఒకరినొక రు ప్రేమించుకొన్నారు. అయితే వారి కుటుంబా లు ఒప్పుకోకపోవడంతో అది పెండ్లికి దారితీయలేదు. దీంతో శ్రద్ధా వాకర్ తన తల్లిదండ్రులను కాదనుకొని తన ప్రియుడైన ఆఫ్తాబ్నే జీవిత సర్వస్వంగా భావించి అతనితో వెళ్లిపోయింది. నాలుగేండ్ల పాటు ఇద్దరూ సహజీవనం చేశారు. ఆ సమయంలో తనను పెండ్లి చేసుకోవాలని ఒత్తి డి తీసుకురావడంతో పెండ్లి ఇష్టంలేని ఆఫ్తాబ్ ఆమెను వదిలించుకోవడానికి హంతకుడిగా మా రాడు. శ్రద్ధను 35 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు.
దీనికి కొనసాగింపుగా పంజాబ్‌లో యూపీలో, బీహార్‌లో ఇలాంటి హేయమైన సంఘటనలే జరిగాయి. ఇటీవల ఢిల్లీలో మరో పదహారేండ్ల బాలికను ఆమె ప్రియుడు 34 కత్తిపోట్లతో అత్యం త కిరాతకంగా హత్య చేసిన వైనం ఆందోళన కలిగిస్తున్నది.
విఫలప్రేమలు ఇప్పటివేం కాదు..
దేవదాసు-పార్వతి, హీర్-రాంజా, సలీం-అనార్కలి. రోమియో.-జూలియట్ల ప్రేమకథ లు మనకు తెలిసినవే. ఈ కథల్లో పేమను త్యాగం చేసి ప్రేమ అనే పదానికి జీవం పోసిన ఉదంతాలే కనిపిస్తాయి. లేదంటే ప్రేమకోసం ఇద్దరూ తమ ప్రాణాలను త్యాగం చేసిన సందర్భాలే కనిపిస్తా యి. అదే విధంగాప్రేమలో మోసపోయి తమ ప్రేమికుల ఎడబాటును తట్టుకోలేక ఇద్దరిలో ఎవ రో ఒకరు బలవన్మరణాలకు పాల్పడిన ఘటన లూ ఉన్నాయి.
ఇక కొన్ని ప్రేమలు పరువు హత్యలకు దారి తీసిన సందర్భాలున్నాయి. తక్కువ కులం వారిని ప్రేమించారనే నేపంతో అమ్మాయి తల్లిదండ్రులు సదరు అబ్బాయినో, లేదా వారి అమ్మాయినో, మరికొన్ని సందర్భాల్లో ఇద్దరినో కడతేరుస్తున్నారు. వీటన్నింటికి భిన్నంగా ఇప్పు డు ప్రేమికులే ఉన్మాదులుగా మారుతున్నారు.
ఈతరం ప్రేమికులు తమ ప్రేమ విఫలమైనప్పుడు మృగాలుగా మారుతున్నారు. తమ ప్రి యురాండ్లను ముక్కలుగా నరికి చెట్టుకో, పుట్ట కో పడేస్తున్నారు. ఇలాంటి ఘోరాలలో వారి మానసిక స్థితిని అంచనా వేసే క్రమంలో తల పండిన సైకాలజిస్ట్లకే వెన్నులో వణుకుపుడుతున్న సందర్భాలు లేకపోలేదు.నాలుగైదేండ్లు తమతో సహజీవనం తర్వాత ఓ మనిషి తన జీవన సహచరిని చంపాలన్నంత కోపం ఎందుకొస్తున్నది. కొన్ని సందర్భాల్లో శరీరభాగాల్లో కొన్నింటిని ఇంట్లోనే ఉంచుకొని ఇతర పనులు చేసుకోవడమో, మరో అమ్మాయితో గడపడమో చేస్తున్నారంటే వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి కిరాతక ప్రవృత్తి ప్రేమికుల నుంచి వివాహేతర సంబంధాల వలలో చిక్కుకున్న వారికి వ్యాపిస్తున్నది. తమ అక్రమ లైంగిక సంబంధాలను కప్పి పుచ్చుకోవడానికి తమ జీవిత భాగస్వాములను సైతం ఆనవాళ్ళు దొరకకుండా చేస్తున్నారు. ఈ విషయంలో ఆడవారి పాత్రే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో వారిలో ఈ అమానవీయ రాక్షస ప్రవృత్తిని కలిగిస్తున్నదెవరో తెలుసుకోలేక పోతే పరిస్థితులు మరింత విషమించి పోయే ప్రమా దం లేక పోలేదు.
ఇలాంటి హేయమైన నేరాల పరిశోధనలో భాగంగా సంబంధిత అధికారులు నిందితులను ఇంటరాగేట్ చేస్తునప్పుడు అనేక ఆందోళనకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వెబ్ సిరీస్, నెట్ ఫ్లిక్స్, ఓటీటీల్లో వస్తున్న క్రైమ్ సీరియళ్ల్లే తమకు ప్రేరణ అనీ, ఇంటర్నెట్ ద్వారా మానవ శరీరాన్ని ము క్కలుగా ఎలా చేయవచ్చో అనేక సార్లు చూడడం ద్వారానే చేయగలిగామని చెప్పడం గమనార్హం. అలా చేయడానికి అవసరమైన ధైర్యాన్ని కూడ గట్టుకోవడానికి వారికున్న మద్యం, మత్తు పదార్థాల అలవాటు వెన్నుదన్నుగా నిలుస్తోందని నేరస్థుల నేర చరిత్ర ఋజువు చేస్తున్నది.
ఈ రాక్షస క్రీడను ఆపేదెవరు?
మనిషి తోటి మనుషులను అత్యం త హేయమైన రీతిలో హత్య చేయడంలో ఆంతర్యమేమిటీ?.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరకడానికి వారి మెంటల్ డిజార్డరే కారణమేమోననే అంశంపై మానసిక వైద్యు ల చేత సమగ్ర అధ్యయనం చేయించాలి. తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లల మానసిక స్థితి, లైంగిక ప్రవర్తనను గమనించాలి. ఎప్పటికప్పుడు వారిని సన్మార్గంలో నడిపించడానికి అవసరమైన స్ఫూర్తిని, మార్గదర్శకత్వాన్ని అందించాలి. ము ఖ్యంగా టీవీలు, మొబైల్ వంటి గ్యాడ్జెట్లను వాడే క్రమంలో వారిపై నిరంతర నిఘా ఉంచాలి. మరో వైపు ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తితో పాఠశాల స్థాయి నుంచే నైతిక విలువలతో పాటు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే విద్యా విధానాన్ని రూపొందించాలి. తద్వారా పసితనం నుంచే అలాంటి ఊబిలో చిక్కకుండా యువతను కాపాడాలి.
కృత్రిమ మేధస్సుతో విజ్ఞానపు కిటికీ ద్వారా ఈ సమాజంలోకి వెల్లువలా ప్రవేశిస్తున్న వెబ్ సిరీస్‌లు, ఓటీటీలకు స్వీయ నియంత్రణతోపాటు ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ఇంటర్ నెట్ అ నుసంధానంతో నడుస్తున్న నెట్‌వర్క్‌లన్నీ స్వీయ నియంత్రణను పాటించడం ద్వారా సమాజానికి హాని కలిగించే కంటెంట్‌తో కార్యక్రమాలను రూపొందించకుండా ఉండాలి. అంతేకాకుండ సద రు అమానవీయ ఘటనలు జరగకుండా నిరోధించడానికి కఠిన చట్టాలను రూ పొందించాలి.వాటిని చిత్తశుద్ధితో అమలుచేయాలి.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వా రా నేరస్థులను విచారించి కఠినశిక్షలను విధించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల కు ఉగ్గుపాలతోనే నైతిక విలువలను రంగరించి పోసే బాధ్యతను త్రికరణశుద్ధిగా నిర్వర్తించాలి. లేని పక్షంలో ఇలాంటి ఘో రాలు నేరాలకు అంతు ఉండదనే వాస్తవాన్ని గుర్తించాలి.
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)
దేవదాసు-పార్వతి, హీర్-రాంజా, సలీం-అనార్కలి, రోమియో-జూలియట్ల ప్రేమకథలు మనకు
తెలిసినవే. ఈ కథల్లో పేమను త్యాగం చేసి ప్రేమ అనే పదానికి జీవం పోసిన ఉదంతాలే కనిపిస్తాయి. లేదంటే ప్రేమకోసం ఇద్దరూ తమ ప్రాణాలను త్యాగం చేసిన సందర్భాలే కనిపిస్తాయి.