మోదీ.. ఓబీసీ జనగణన ఏదీ?
ఎన్నో వాగ్దానాలు, హామీలతో అధికారం చేపట్టిన మోదీ ఎనిమిదేండ్లవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఆయన గెలవడానికి ప్రధాన కారణమైన ‘ఓబీసీల జనగణన’ను కూడా అట కెక్కించారు. ‘నది దాటేదాక ఓడ మల్లయ్య, దాటిన తర్వాత బోడి మల్లయ్య’ అన్నట్లుగా మోదీ వ్యవహరిస్తున్నారు.
ఎన్నో వాగ్దానాలు, హామీలతో అధికారం చేపట్టిన మోదీ ఎనిమిదేండ్లవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఆయన గెలవడానికి ప్రధాన కారణమైన ‘ఓబీసీల జనగణన’ను కూడా అట కెక్కించారు. ‘నది దాటేదాక ఓడ మల్లయ్య, దాటిన తర్వాత బోడి మల్లయ్య’ అన్నట్లుగా మోదీ వ్యవహరిస్తున్నారు.
సమాజంలో అన్నివర్గాలకు అభివృద్ధి సంక్షేమ ఫలా లందాలంటే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అవసరమని నాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి కులాలవారీగా జనగణన చేసింది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత నుంచి నేటివరకు ఏ ప్రభుత్వం ఓబీసీల కులగణన జరపలేదు. ఫలితంగా దేశంలో ఓబీసీల జనాభా అంచనాలు తప్ప అధికారిక గణాంకాలు లేవు.
2010లో బీసీల కులాలవారీగా లెక్కలు తీయాలని పార్లమెంటులో బీజేపీ డిమాండ్ చేసింది. ఓబీసీ జనగణన జరుపుతామని 2018లో అంటే లోక్‌సభ ఎన్నికలకు ఏడాదిముందు నాటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్వయంగా ప్రకటించారు. కానీ, అధికారం మళ్లీ దక్కిన తర్వాత బీజేపీ మాట మార్చింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఎంతో కృషిచేశారు. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు బీసీల సమస్యలను అధ్యయనం చేయడానికి ఓబీసీకి చెందిన ఎంపీ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ అధ్యక్షతన కమిటీ వేశారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటించి 3,743 కులాలను బీసీ కులాలుగా గుర్తించింది. వారి పరిస్థితులను మెరుగుపరచడం కోసం వారికి రాజకీయపరమైన రిజర్వేషన్లతో సహా అన్నిరంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నది. ఈ విధంగా జనాభా నిష్పత్తి ప్రకారం.. 52 శాతం ఉండాల్సిన రిజర్వేషన్లు కేవలం 27 శాతానికే పరిమితమయ్యాయి.
బీసీల అభ్యున్నతి కోసం మోదీ ప్రభుత్వం తొందరగా ఓబీసీ జనగణన చేపట్టాలి. బీసీ వ్యక్తి ప్రధాని అని చెప్పుకొంటున్న బీజేపీ ఓబీసీ గణన చేపట్టకపోవడం శోచనీ యం. కుల జనగణన అనేది ప్రజాస్వామిక పాలనలో అనివార్యమైన ప్రక్రియ. దీన్ని చేపట్టకుండా ఏ ప్రజా ప్రభుత్వం ప్రజానుకూల పాలన చేయలేదు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. ఏ కులం, వర్గం ప్రజ లు ఎంత శాతం ఉన్నారో తెలియకుండా సంక్షేమ పథకాలను రూపొందించటం అసాధ్యం. అలాంటప్పుడు ఓబీసీ జనగణన వ్యతిరేకించటమంటే.., బీసీల పట్ల వారికి ఎంత ప్రేమ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మతాల పేరిట రాజకీయం చేసే బీజేపీ.. ఈ డిమాండ్‌ను విచ్ఛిన్నకరమైనదిగా ప్రచారం చేయటం విడ్డూరం.
ఓబీసీ జనగణనపై తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే తీర్మా నం చేసి కేంద్రానికి పంపించింది. మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బీహార్ కూడా మద్దతు తెలిపాయి. అయినా బీజేపీ ప్రభుత్వం ఓబీసీ జనగణన అసాధ్యమంటున్నది. ఎందుకంటే.. కులగణన ద్వారా సామాజిక ఉద్రిక్తతలకు కారణమవుతుందట! ఇంతకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా? మతం, దేవుని పేర ప్రజల్లో విభజన రేఖలు గీసి రాజకీయ పబ్బం గడుపుకొనే బీజేపీ కులగణన వచ్చేసరికి కబుర్లు చెప్తున్నది. ఇది మెజారిటీ ప్రజలైన ఓబీసీలను హేళన చేయటమే. మోదీకి రాబోయే రోజుల్లో ఓబీసీలు తగిన గుణపాఠం తప్పక చెప్తారు.
బీజేపీయేతర పాలిత రాష్ర్టాలు ప్రత్యేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయి. ఢిల్లీలో బీసీ సంఘాలు ధర్నా చేశాయి. దీనికి అన్నిపార్టీల నేతలూ మద్దతిచ్చారు. ఈ క్రమంలో కేంద్రం జనాభా లెక్కలతో పాటు ఓబీసీ జనగణన చేయడం సాధ్యం కాదని తేల్చేయడం ద్రోహపూరితమైన చర్య. ఎనిమిదేండ్లుగా జంతువుల గణన చేస్తున్న నయవంచన మోదీ ప్రభు త్వం ఓబీసీల జనగణన మాత్రం చేయలేదు. 52 శాతం ఉన్న ఓబీసీలు జనగణన కోసం ఉద్యమిస్తూ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి బైబై చెప్పడం ఖాయం.
డాక్టర్ సంగని మల్లేశ్వర్, 98662 55355
(వ్యాసకర్త: విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కేయూ)
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ఆ క్రెడిట్ ప్రభాస్‌కే సొంతం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

