జీవితం వింతల విహారం !
జలపాతం
దూకుతున్న దృశ్యం
నయనాలకు అందమే!
జీవితం
యవ్వనంలో గువ్వలా
ఎగురుతున్నప్పుడు గర్వమే!
చినుకుకు ఎన్ని కష్టాలు!
చినుకై కురిసి వాగై పారాలి
వేడిమితో పోరాడి
ఆవిరై తేలి పోవాలి!
జీవన యానంలో
ఎన్ని కష్టాలో!
నీ నడక నువ్వే నడవాలి
ఎన్నో తెలియని
మజిలీలు దాటి
నీ గమ్యం చేరుకోవాలి!
చినుకు కురిసేటప్పుడు
స్వచ్ఛమైనదే!
మురికి గుంటలో
పడుతుందో
ఆల్చిప్పలో పడి
ముత్యమై మెరుస్తుందో!
పుట్టినప్పుడు పసి పిల్లలు
దేవుండ్లే!
రాముడౌతాడో
రక్కసి అవుతాడో
వాని చేష్టలే నిర్ణయిస్తాయి!
జీవితం నయాధార !
పి.బక్కారెడ్డి
9705315250