Crorepati Ambulance driver |రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన అంబులెన్స్ డ్రైవర్.. అదెలాగంటే..
AMBULANCE DRIVER JACKPOT | రాత్రికిరాత్రే కోటీశ్వరులైన వారిని మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో ఇతని పేరు షేక్ హిరా. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు వర్ధమాన్ జిల్లాలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు

రాత్రికిరాత్రే కోటీశ్వరులైన వారిని మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో ఇతని పేరు షేక్ హిరా. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు వర్ధమాన్ జిల్లాలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బతుకు బండిని ఎంతో కష్టంగా లాగుతున్న షేక్ హిరా ఒక్కసారిగా జాక్‌పాట్ కొట్టాడు. తను పొద్దునే చేసిన ఒక పని షేక్ హిరాను కోటీశ్వరుడిని చేసింది.
ఇటీవల ఒక రోజు ఉదయం షేక్ హిరా రూ.270 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. మధ్యాహ్నానికే అతడికి షాకింగ్ విషయం తెలిసింది. తను కొన్న టికెట్‌కు రూ.కోటి జాక్‌పాట్ తగిలినట్టు తెలిసింది. లాటరీ టికెట్ తగలగానే ఏం చేయాలో అర్థంకాక సహాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. వారు హీరాను జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటివద్ద దిగబెట్టి వచ్చారు. తాను ఆర్థిక కష్టాల్లో ఉన్నానని, ఈ డబ్బు తనకు చాలా డబ్బు అవసరమని హీరా చెప్పాడు.
“చాలాకాలంగా లాటరీలు కొంటున్నాను.. ఏదో ఒక రోజు నాకు లాటరీ తగులుతుందని నాకెందుకో అనిపించేది.. అది ఈ రోజు నిమమైంది” అని అన్నాడు. లాటరీలో గెలిచిన డబ్బుతో ముందు అనారోగ్యంతో ఉన్న తన తల్లికి చికిత్స చేయిస్తానని, ఆ తర్వాత ఓ ఇల్లు కొనుక్కుంటానని హీరా చెప్పాడు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

