ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తి : అతిపిన్న వయసులో యూనివర్సిటీ డిగ్రీ పొందిన బాలుడు

న్యూయార్క్ : ప్రపంచంలో అతి పిన్న వయసులో 11 ఏండ్లకే యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌గా పట్టా పొందిన సిమన్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.ఈ అరుదైన ఘనత సాధించిన ప్రపంచంలో రెండో వ్యక్తిగా సిమన్స్ చరిత్ర సృష్టించాడు. సహజంగా 20 ఏండ్లు దాటిన తర్వాత విద్యార్ధులు ఈ డిగ్రీని పొందుతున్న క్రమంలో సిమన్స్ 11 ఏండ్లకే పట్టా పొందాడు. బెల్జియంలోని ఒస్టెండోకు చెందిన సిమన్స్ యూనివర్సిటీ ఆఫ్ యాంట్వెప్ నుంచి ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 85 శాతం మార్కులతో డిస్టింక్షన్ సాధించాడు.
1994లో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అలబామా నుంచి ఆంథ్రోపాలజీలో పదేండ్ల వయసులోనే గ్రాడ్యుయేట్‌గా మారిన మైఖేల్ కిర్నీ తర్వాత యూనివర్సిటీ పట్టా పొందిన అత్యంత పిన్నవయస్కుడిగా సిమన్స్ నిలిచాడు. మానవుల శరీర భాగాలను మెకానికల్ భాగాలతో మార్చడం ద్వారా మనిషి చావును జయించేలా చేయడమే తన ధ్యేయమని సిమన్స్ స్పష్టం చేశాడు. ఆ దిశగా తాను మార్గాన్ని రూపొందించుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. నాలెడ్జ్‌ను పొందడం..దాన్ని అమలుచేయడం తన అధ్యయనానికి కీలకమని సిమన్స్ చెబుతాడు.
ప్రపంచంలోనే ప్రముఖ ప్రొఫెసర్లతో కలిసి పనిచేసి వారి ఆలోచనావిధానాన్ని ఆకళింపు చేసుకోవాలనేది తన ఆకాంక్షని పేర్కొన్నాడు. కాగా సిమన్స్ పదేండ్లు రాకముందే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేవాడని, తన కుమారుడిపై మీడియా దృష్టి సారిస్తోందని ఆరోపిస్తూ ఇంద్హోవెన్ వర్సిటీ గ్రాడ్యుయేట్ కాకుండా అడ్డుకుందని బాలుడి తండ్రి అలెగ్జాండర్ సిమన్స్ ఆరోపించారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- Boy
- Graduate
- world record
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

