Train horns: ఆడవారి మాటలకు కాదు.. రైలు బండి కూతలకు అర్థాలు వేరేనట..!
Train horns: ఆడవారి మాటలకూ.. అర్థాలే వేరులే..! అర్థాలే వేరులే.. అర్థాలే వేరులే..! అని పవన్‌కళ్యాణ్ సినిమాలో ఓ పాట ఉంటుంది. ఆ పాటలో చెప్పినట్లుగా ఆడవారి మాటలకు అర్థాలు వేరో కాదో తెలియదుగానీ

న్యూఢిల్లీ: ఆడవారి మాటలకూ.. అర్థాలే వేరులే..! అర్థాలే వేరులే.. అర్థాలే వేరులే..! అని పవన్‌కళ్యాణ్ సినిమాలో ఓ పాట ఉంటుంది. ఆ పాటలో చెప్పినట్లుగా ఆడవారి మాటలకు అర్థాలు వేరో కాదో తెలియదుగానీ రైలు బండి కూతలకు ( Train horns ) మాత్రం అర్థాలు వేరేనట. రైల్వే గార్డులను, సిబ్బందిని, ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు, హెచ్చరించేందుకు రైలు హారన్లను మోగిస్తుంటారు. ఇలా మొత్తం 11 రకాల హారన్లు ఉన్నాయట. అందులో ఒక్కో రకానికి ఒక్కో అర్థం ఉందట. మరి ఆ రైలు కూతల అర్థాలేమిటో మనం కూడా తెలుసుకుందామా..?
ఏ హారన్‌కు ఏమని అర్థం..?
ఒక చిన్న హారన్: లోకో పైలట్ ఒక చిన్న హారన్ సౌండ్ చేస్తే రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తీసుకెళ్తున్నట్టు అర్థమట.
రెండు చిన్న హారన్లు: రెండు చిన్న హారన్ల శబ్దం వినిపిస్తే రైలు బయల్దేరడానికి సిగ్నల్ ఇవ్వాల్సిందిగా గార్టును లోకో పైలట్ కోరుతున్నట్టు అర్థమట.
మూడు చిన్న హారన్లు: మూడు చిన్న హారన్ల శబ్దం వినిపిస్తే మోటార్ పైన తన కంట్రోల్ పోయిందని, వ్యాక్యూమ్ బ్రేక్ వేయాలని గార్డుకు లోకోపైలట్ సమాచారం ఇస్తున్నట్టట. ఈ హారన్ అత్యంత అరుదుగా అవసరమవుతుందట.
నాలుగు చిన్న హారన్లు: రైలులో ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే లోకోపైలట్ నాలుగు సార్లు చిన్న హారన్లు మోగిస్తాడట. అంటే రైలు ముందుకు కదలడానికి సిద్ధంగా లేదని అర్థమట.
ఒక లాంగ్ హారన్, ఒక షార్ట్ హారన్: రైలు ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికన్నా ముందు బ్రేక్ పైప్ సిస్టమ్ సెట్ చేయాలని గార్డుకు సిగ్నల్ ఇచ్చేందుకు లోకోపైలట్ ఒక లాంగ్, ఒక షార్ట్ హారన్ ఇస్తారట.
రెండు లాంగ్ హారన్లు, రెండు షార్ట్ హారన్లు: రైలు ఇంజిన్‌ను కంట్రోల్లోకి తీసుకోవాలని గార్డుకు సూచిస్తూ లోకోపైలట్ రెండు లాంగ్ హారన్లు, రెండు షార్ట్ హారన్లు ఇస్తారట.
నిరంతరాయంగా హారన్: రైల్వే స్టేషన్లో హాల్ట్ లేనప్పుడు రైలు ఆగకుండా వెళ్తుందని ప్రయాణికులను అలర్ట్ చేసేందుకు లోకోపైలట్ నిరంతరాయంగా హారన్ మోగిస్తారట. నాన్‌స్టాప్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్టేషన్లలోకి వచ్చినప్పుడు ఈ హారన్లు వినిపిస్తాయట.
రెండు స్వల్ప విరామాలతో రెండు హారన్లు: రైలు రైల్వే క్రాసింగ్ దాటే సమయంలో పట్టాలు దాటుతున్న వారిని అప్రమత్తం చేసేందుకు లోకోపైలట్ రెండు స్వల్ప విరామాలతో రెండు హారన్లు మోగిస్తాడట.
రెండు సార్లు లాంగ్ అండ్ షార్ట్ హారన్లు: రైలు ట్రాక్ మారేప్పుడు లోకో పైలట్ రెండు సార్లు లాంగ్ అండ్ షార్ట్ హారన్లు మోగిస్తాడట.
రెండు షార్ట్ హారన్లు, ఒక లాంగ్ హారన్: రైల్వే ప్యాసింజర్ చైను లాగినా, గార్డ్ వ్యాక్యూమ్ బ్రేక్ లాగినా లోకోపైలట్ రెండు షార్ట్ హారన్లు, ఒక లాంగ్ హారన్ మోగిస్తాడట.
ఆరు షార్ట్ హారన్లు: రైలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోకోపైలట్ ఆరు సార్లు షార్ట్ హారన్లు మోగిస్తాడట.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

