కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం : ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు
లండన్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపాధ్యక్షులు హరిగౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి రేటినేనితో కలిసి నవీన్ రెడ్డి పాల్గొన్నారు.
లండన్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపాధ్యక్షులు హరిగౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి రేటినేనితో కలిసి నవీన్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ గొంతుకై, ఎలాగైతే ఉద్యమం సమయం నుంచి నేటి వరకు కేసీఆర్ వెంటే ఉండి ముందుకు నడిచామో.. అదే స్ఫూర్తితో నేడు ప్రతిపక్ష పాత్రలో సైతం ప్రజల పక్షాన నిలబడి అటు సోషల్‌మీడియాలో, లంనడ్ కేంద్రంగా ప్రత్యేక నిరసనల ద్వారా కాంగ్రెస్ నిరంకుశ పాలనను ఎండగడుతామని నవీన్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని పేరర్కొన్నారు. ఎంతోమంది ఎన్నారై మిత్రులు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాబట్టి ఎప్పటికీ కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని పేర్కొన్నారు. అలాగే కేసీఆర్ పిలుపు మేరకు నవంబర్ 29న లండన్‌లో దీక్షా దివస్ ఘనంగా నిర్వహించబోతున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా తనకు నూతన అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోశ్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, అశోక్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ ఎన్నారై బీఆర్ఎస్ నాయకులకు, ఎన్నారై బీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గానికి నవీన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- KCR
- london
- Naveen Reddy
- NRI BRS
RELATED ARTICLES
తాజా వార్తలు
Monthly Income Plans | నెలనెలా ఆదాయం కావాలా? మీ డబ్బుకు భరోసా ఇచ్చే టాప్ పెట్టుబడి పథకాలు ఇవే!
Municipal Elections | మున్సి‘పోల్’కు కాంగ్రెస్ వణుకు.. 5 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఎప్పుడో?
Government Orders | అనాలోచితంగా జీవోలు.. ఆపై యూటర్న్లు.. బోరుబావుల తవ్వకాలకు కొత్త వెసులుబాటు
Cyclone Akvan | దూసుకొస్తున్న ‘అక్వాన్’.. మహబూబాద్ భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు
JNTU Professor Jobs | 30 లక్షలకో ప్రొఫెసర్ పోస్టు.. జేఎన్టీయూలో అక్రమ వసూళ్ల పర్వం!?
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

