తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాలి : వెంకయ్య నాయుడు
ఎన్నారై | తెలుగు భాష అందరికి మరింత చేరువయ్యేలా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని, భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

ఢిల్లీ : తెలుగు భాష అందరికి మరింత చేరువయ్యేలా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని, భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. న్యూ ఢిల్లీలో తన అధికారిక భవనంలో అంతర్జాల వేదిక ద్వారా వెంకయ్య నాయుడు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంథాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..27 ఏండ్లుగా తెలుగు భాషా సదస్సులు నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ముదావహమన్నారు. 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని ప్రశంసించారు. తెలుగు భాషా సంస్కృతుల కోసం తాను ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి చొరవను ఆకాంక్షిస్తున్నామని, తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు తీసుకుపోయే ఏ అవకాశాన్ని వదులుకోరాదని సూచించారు.
ఈ ఆవిష్కరణ మహోత్సవం తర్వాత జూమ్ వేదిక లో జరిగిన “సభా విశేష సంచిక” డయాస్పోరా తెలుగు కథానికి -15, వెనుతిరగని వెన్నెల (డా.కె.గీత) “వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?( డా. చాగంటి కృష్ణకుమారి) గ్రంధాల పరిచయం, 7వ ప్రపంచ సాహితీ సదస్సు జ్ఞాపకాల రవళి కార్యక్రమం రెండు గంటలకి పైగా అంతర్జాలం లో విజయవంతంగా జరిగింది. ఈ వేదికలో ఆ సదస్సు ప్రధాన నిర్వాహకులు, పాల్గొన్న కొందరు వక్తలు, వేదిక నిర్వాహకులు మొదలైన వారు పాల్గొని తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Pradesh | అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్.. హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ!
Medigadda | నిరంతరం జలతరంగం.. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
Jagadish Reddy | కన్నెపల్లికి పోదామా.. పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో చూస్తా.. జగదీశ్ రెడ్డి సవాల్!
Random Trees | కేటీఆర్ స్ఫూర్తితో.. ర్యాండమ్ ట్రీస్.. అమెరికాలో ప్రారంభమై, పలు దేశాలకు సేవలందిస్తున్న కంపెనీ
RTC Land | ఆర్టీసీ జాగ.. సర్కార్ పాగా.. హౌసింగ్ బోర్డుకు రూ.వెయ్యి కోట్ల భూమి ఇస్తూ జీవో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

