Saichand | ప్రవాసులందరి ఆత్మీయుడు సాయి చంద్
Saichand | తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (SAI CHAND) ఆకాల మరణం యావత్ ప్రవాస తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు.
Folk Singer Saichand | లండన్ సమీపంలోని రీడింగ్ నగరంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ సంస్మరణ కార్యక్రమంలో ప్రవాస తెలంగాణ వాదులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయం నుండి క్రియాశీలకంగా పనిచేస్తున్నందున మాకు సాయిచంద్‌తో మంచి అనుబంధముందని, మేము చేసే కార్యక్రమాల్ని మీడియా ద్వారా తెలుసుకొని మాలో చాలా మందికి ఫోన్ చేసి అభినందించి ప్రోత్సహించే మంచి వ్యక్తిత్వం, సమాజం పట్ల ఎంతో బాధ్యత ఉన్నవారు సాయిచంద్ అని గుర్తుచేసుకున్నారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న సాయిచంద్ ఇలా మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా తన పాటల రూపంలో మన మధ్యే ఎల్లపుడూ చిరంజీవిగా వర్ధిల్లుతాడని అశోక్ తెలిపారు.
ఎన్నికల అనంతరం సాయిచంద్‌ను లండన్ తీసుకురావాలని ఇటీవల లండన్ సందర్శనకు వచ్చిన మా సంస్థల వ్యవస్థాపకులు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం చెప్పారని.. ఇంతలోనే ఇలా జరగడం ఎంతో బాధగా ఉందని సతీష్ రెడ్డి బండ తెలిపారు.
సాయిచంద్ కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని.. స్వదేశానికి వచ్చిన వెంటనే సాయిచంద్ కుటుంబాన్ని కలుస్తామని, భగవంతుడు ఈ విషాదాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని వారి కుటుంబానికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నామని సీనియర్ నాయకుడు బీరం మల్లా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్ దూసరి, బీరం మల్లా రెడ్డి, జాహ్నవి, సతీష్ రెడ్డి బండ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

