Deeksha Divas | లండన్‌లో ఘనంగా దీక్షా దివస్
Deeksha Divas | లండన్‌లో బీఆర్ఎస్ యూకే శ్రేణులు దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాయి. ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణవాదులు హాజరయ్యారు.
Deeksha Divas | లండన్‌లో బీఆర్ఎస్ యూకే శ్రేణులు దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాయి. ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణవాదులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29న ‘తెలంగాణ వచ్చుడో -కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదం తో కేసీఆర్ తల పెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు. అందుకే ఆ రోజును దీక్షా దివస్‌గా జరుపుకుంటున్నామని తెలిపారు.
సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి, శాంతియుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు.

Nri Brs Uk2
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యక్షులు హరి గౌడ్, రవి కుమార్ మాట్లాడుతూ.. నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ ఎంచుకున్న అహింసా పద్ధతిని మన తెలంగాణ గాంధీజీ కేసీఆర్ పాటించి రాష్ట్ర సాధనోద్యమంలో ఎటువంటి హింసకు తావు లేకుండా, శాంతియుత పంథాతో ఏదైనా సాధించవచ్చనే గొప్ప సందేశాన్ని ఇచ్చారని తెలిపారు.
ఉపాధ్యక్షులు సత్య మూర్తి చిలుముల, సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తలపెట్టిన దీక్ష నుంచి నేటి వరకు వారికి మద్దతుగా ఉంటూ, చేపట్టిన కార్యక్రమాలను, ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడం మన చారిత్రాత్మక అవసరమని, ఎన్నారై బీఆర్ఎస్ సెల్ కి ఎప్పటికప్పుడు కేసీఆర్, యావత్ బీఆర్ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వారి వెంట ఉంటామని తెలిపారు.

Nri Brs Uk3
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు నవీన్ రెడ్డి, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సతీశ్ రెడ్డి గొట్టిముక్కుల, సత్యమూర్తి చిలుకుల, రవి రేటినేని, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల, అడ్వైజరీ సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, కార్యదర్శి – ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కోశాధికారి సురేశ్ బుడగం, సోషల్ మీడియా కన్వీనర్స్ అంజన్ రావు, పవన్ కళ్యాణ్, అబ్దుల్ హాజరైన వారిలో ఉన్నారు
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

