BRS NRI UK | లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషి.. బీఆర్ఎస్ ఎన్నారై లండన్ శాఖ
BRS NRI UK | లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ లండన్ ఎన్నారై శాఖ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది.
BRS NRI UK | లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ లండన్ ఎన్నారై శాఖ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే శాఖ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం ప్రత్యేకంగా కృషి చేస్తామని అశోక్ తెలిపారు. గత 100 రోజుల కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సమస్యలు, నీళ్ల సమస్యలు పరిష్కారం కాలేదని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అశోక్ గౌడ్ దూసరి చెప్పారు. ఒక్క హామీ కూడా అమలుచేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. కనుక కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం అభ్యర్థుల గెలుపులో ఎంతో కీలకంగా మారిందని అశోక్ గౌడ్ గుర్తు చేశారు. ఉద్యమ సమయం నుండి ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే సోషల్ మీడియా వేదిక ద్వారా పార్టీ కి ఎంతో సేవలందించిన సంగతి గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా బీ.ఆర్.యస్ పార్టీ గెలుపుకై అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర సమస్యల పట్ల పార్లమెంట్ వేదికగా తెలంగాణ గొంతుకై పనిచేసేది అవసరమైతే పోరాటం చేసేది కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనన్నారు.
ఈ సమావేశంలో ఎన్నారై బి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సిక్కా, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శి సత్యమూర్తి చిలుముల, ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు రవి ప్రదీప్ పులుసు, అబ్దుల్ జాఫర్, వెంకట్ రెడ్డి డొంతుల, సురేష్ గోపతి, వీర ప్రవీణ్ కుమార్, రమేష్ ఎసెంపెల్లి, రవి రేతినేని, సత్యపాల్ పింగిళి, పృథ్వీ రావుల, గణేష్ కుప్పలా, మధు యాదవ్ ఆబోతు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

