South East Central Railway Apprentice Recruitment 2023 | వెల్డర్, సీవోపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, అప్ఫోయిస్టరర్, మెషినిస్ట్, టర్నర్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్, టెక్నీషియన్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, గ్యాస్ కట్టర్ తదితర విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నాగ్‌పుర్‌లోని(Nagpur) సౌత్ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్) ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 772 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూలై 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ కాలం ఒక యేడాది పాటు ఉంటుంది.
మొత్తం పోస్టులు : 772
పోస్టులు : ట్రేడ్ అప్రెంటిస్‌షిప్
విభాగాలు: వెల్డర్, సీవోపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, అప్ఫోయిస్టరర్, మెషినిస్ట్, టర్నర్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్, టెక్నీషియన్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, గ్యాస్ కట్టర్ తదితరాలు.
అర్హతలు : 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 15-24 ఏండ్ల మధ్య ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి: 1 ఏడాది.
దరఖాస్తు : ఆన్లైన్లో
ఎంపిక : పదో తరగతి, ఐటీఐ మార్కుల ద్వారా
చివరి తేది: జూలై 7
వెబ్సైట్: https://secr.indianrailways.gov.in/