last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1, University of Delhi | ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టులు
University of Delhi | 106 అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, నెట్/ జేఆర్ఎఫ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 106
పోస్టులు: అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టులు
విభాగాలు : కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హిందీ, హిస్టరీ, మ్యాథ్స్, మేనేజ్మెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, టూరిజం.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, నెట్/ జేఆర్ఎఫ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
జీతం : నెలకు రూ.57,700.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.500(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
చివరితేదీ: ఏప్రిల్ 15
వెబ్సైట్: https://colrec.uod.ac.in
మరింత సమాచారం కోసం : www.du.ac.in
2.SAIL bokaro Recruitment | ఝార్ఖండ్ బొకారో స్టీల్ ప్లాంటులో 239 పోస్టులు
SAIL bokaro Recruitment |ఝార్ఖండ్ (Jharkhand)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్.. ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 239
పోస్టులు : 1. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు( కన్సల్టెంట్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్(సేఫ్టీ), మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్(ఎన్విరాన్మెంట్) తదితరాలు).
2.నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు ( ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ), మైనింగ్ ఫోర్మాన్, సర్వేయర్, మైనింగ్ మేట్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)- హెచ్ఎంవీ, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఎలక్ట్రీషియన్, మైనింగ్ సిర్దార్ తదితరాలు).
అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక : పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: ఏప్రిల్ 15
వెబ్సైట్ : www.sail.co.in
3. REC Ltd Recruitment | ఆర్ఈసీలో 125 పోస్టులు..
REC Ltd Recruitment 2023 | జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ మహారత్న విభాగంలోని ఆర్ఈసీ లిమిటెడ్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ గడువు రేపటితో ముగియనుంది.
మొత్తం పోస్టులు : 125
పోస్టులు: జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితరాలు.
విభాగాలు: అడ్మిన్, సీసీ, లా, సెక్రటేరియల్, రాజ్భాష, సీఎస్, ఐటీ, హెచ్ఆర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీటెక్, బీఈ, డిప్లొమా సీఏ, సీఎంఏ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, మాస్టర్స్డిగ్రీ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఈ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 3 నుంచి 21 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 33 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో మినహాయింపు ఉంటుంది.
జీతం : ఏటా రూ.7లక్షలు-రూ.26లక్షలు
ఎంపిక : రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 15
వెబ్సైట్ : https://recindia.nic.in/