ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నత శిఖరాలకు
సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్

నిజామాబాద్ లీగల్ : ప్రతి వ్యక్తి ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్ఎఫ్ బాయ్స్ పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
విద్యనభ్యసించే దశలో విద్యపైనే నిరంతర ధ్యాస ఉంచాలని, చెడు వ్యాపకాలపై దృష్టికోణం ఉండరాదని సూచించారు. చదువు ఒక మంచి భవిష్యత్తును నిర్మింపజేస్తుందని అన్నారు. అనాలోచిత చర్యలు అధ:పాతాళానికి గురి చేస్తాయన్నారు.
సంస్థ సభ్యుడు, సీనియర్ న్యాయవాది రాజ్‌కుమార్ సుబేదార్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి చట్టాలు ఉన్నాయని, బాలల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తాయని అదే క్రమంలో చట్ట వ్యతిరేక పనులకు పాల్పడిన వారిని శిక్షించడానికి చట్టం అనుమతినిస్తుందని తెలిపారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి చదువును మించిన సంపద లేదని ఆయన అన్నారు . సదస్సులో ఉపాధ్యాయులు అనుపమ సుబేదార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

