రైలులో అక్రమంగా నల్లబెల్లం తరలింపు
మహారాష్ట్ర ప్రాంతం నుంచి తెలంగాణలోని ఓ జిల్లాకు రైలులో అక్రమంగా నల్లబెల్లం తరలిస్తుండగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం దాడులు చేసి స్వాధీనం చేసుకుంది. దాడిలో తొమ్మిది క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
- ఆర్పీఎఫ్ దాడిలో తొమ్మిది క్వింటాళ్లు స్వాధీనం
- కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 5: మహారాష్ట్ర ప్రాంతం నుంచి తెలంగాణలోని ఓ జిల్లాకు రైలులో అక్రమంగా నల్లబెల్లం తరలిస్తుండగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందం దాడులు చేసి స్వాధీనం చేసుకుంది. దాడిలో తొమ్మిది క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నల్ల బెల్లం నాటు సారా తయారీకి ఉపయోగిస్తున్నారని చెప్పారు.
మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్నారన్న సమాచారంతో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ఎస్సై ప్రత్యూష సిబ్బందితో కలిసి ఆదివారం రాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకొన్నారు. నాగవల్లి ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్ స్టేషన్‌కు చేరుకోగానే తనిఖీలు చేపట్టి ఓ బోగీలోని సీటు కింద నల్లబెల్లం సంచులను గుర్తించారు.
వాటిని స్వాధీనం చేసుకొని పరిశీలించగా తొమ్మిది క్వింటాళ్ల నల్లబెల్లం ఉండడంతో నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి.మమతకు అప్పగించారు. పట్టుబడిన నల్లబెల్లం విలువ రూ.50వేల వరకు ఉంటుందని, నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. పట్టుబడిన నల్ల బెల్లాన్ని వరంగల్‌కు తరలిస్తున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

