Inter Admissions | ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల.. యాంటీ డ్రగ్ అఫిడవిట్ సమర్పిస్తేనే ప్రవేశాలు!
Inter Admissions | ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. పాత పద్ధతిలోనే అడ్మిషన్లకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి ప్రవేశాల కోసం కొత్త నిబంధన చేర్చారు.
Inter Admissions | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. పాత పద్ధతిలోనే అడ్మిషన్లకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి ప్రవేశాల కోసం కొత్త నిబంధన చేర్చారు. యాంటీ డ్రగ్ అఫిడవిట్ సమర్పిస్తేనే ఇంటర్ అడ్మిషన్ జారీచేయాలని ఉత్తర్వులిచ్చారు. విద్యార్థి, తల్లిదండ్రులు ఈ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఇలా సమర్పిస్తేనే అడ్మిషన్ కల్పించనున్నారు.
జూన్ 1 నుంచి క్లాసులు
ఇంటర్ ఫస్టియర్ మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 31వరకు దరఖాస్తులు విక్రయిస్తారు. జూన్ 30లోపు మొదటి విడత అడ్మిషన్లు పూర్తికానుండగా, క్లాసులు మాత్రం జూన్ 1 నుంచే ప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. అఫిడవిట్ సమర్పించాలన్న నిబంధనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు న్యాయవాదుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఈ నిబంధనను తొలగించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ శ్రీనివాస్, కే సురేశ్ కోరారు.
ఇవీ నిబంధనలు
- అడ్మిషన్ల కోసం ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించొద్దు. మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు ఇవ్వాలి. పదో తరగతిలో జీపీఏ, గ్రేడ్ పాయింట్ల వారీగా అడ్మిషన్లు కల్పించాలి.
- ఇంటర్నెట్ మార్కుల మెమో ఆధారంగా తాత్కాలిక ప్రవేశాలు కల్పించవచ్చు. ఒరిజినల్ మెమో సమర్పించిన తర్వాతే అడ్మిషన్ ఖరారవుతుంది.
- అన్ని రకాల జూనియర్ కాలేజీల్లో చేరాలనుకునే వారికి ఆధార్ తప్పనిసరి.
- ఇంటర్‌బోర్డు గుర్తింపు పొందిన కాలేజీల్లోనే విద్యార్థులు ప్రవేశాలు పొందాలి. కాలేజీల జాబితా బోర్డు వెబ్సైట్లో ఉన్నది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

