అంతరిక్ష యాత్రలు.. ‘స్పేస్ క్రాఫ్ట్’ సేవలు
GSLV అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV అనేది 4వ తరం రాకెట్
- GSLV-F4 ప్రయోగం విజయవంతం
- GSLV అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్
- GSLV అనేది 4వ తరం రాకెట్
- ప్రయోగించిన తేదీ: 2024, ఫిబ్రవరి 17 (27:30 గంటల కౌంట్‌డౌన్ తర్వాత)
- దీన్ని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న SDSC-SHAR లోని రెండో ప్రయోగ వేదిక నుంచి 5:30 PM కు ప్రయోగించారు
- SDSC- సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
- SHAR- Sriharikota High Attitude Range
- ఇది ప్రయోగించిన ఉపగ్రహం- ఇన్శాట్-3డీఎస్ (INSAT-3DS)
- ఈ ప్రయోగానికి కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసింది
- ప్రస్తుత కేంద్ర భూ విజ్ఞాన శాఖా మంత్రి- కిరణ్ రిజిజు
ఇన్శాట్-3డీఎస్ గురించి..
- బరువు- 2,274 కిలోలు
- ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ నుంచి పని చేయనున్న మూడో తరం వాతావరణ ఉపగ్రహం. ఇది ఒక ఫాలో ఆన్ మిషన్.
- ఈ ఉపగ్రహం మెరుగైన వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ కోసం రూపొందించిన ప్రత్యేక మిషన్.
ఈ ఉపగ్రహం తీసుకెళ్లిన పేలోడ్స్ (4)
- ఇది ప్రస్తుతం పని చేస్తున్న ఇన్శాట్-3డీ & ఇన్శాట్-3డీఆర్ ఇన్-ఆర్బిట్ శాటిలైట్లతో పాటు వాతావరణ సేవలను పెంపొందిస్తుంది.
- 6 చానెల్ ఇమేజర్
- 19 చానెల్ సౌండర్ పేలోడ్
- డేటా రిలే ట్రాన్స్‌పాండర్ (DRT)
- శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ & రెస్క్యూ ట్రాన్స్ పాండర్స్ (SA & SR)
- 6 చానెల్ ఇమేజర్ భూమి, వాతావరణం ఫొటోలను తీస్తుంది
- 19 చానెల్ సౌండర్ వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది
- DRT & SA & SR లు సమాచార ఉపగ్రహాలు
- DRT అన్ని రకాల డేటాను సేకరిస్తుంది
- SA &SR హెచ్చరికను జారీ చేస్తుంది. గ్లోబల్ సెర్చ్, రెస్క్యూ సేవలకు ఉపయోగపడుతుంది
- ఇన్సాట్-3డీఎస్ సేకరించిన వాతావరణ సమాచారాన్ని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ సంస్థలు ఉపయోగించుకుంటాయి
- IMD- India Meteorological Depart ment
- NCMRWF – National Centre for Medium Range Weather Forecasting
- IITM- Indian Institute of Tropical Meteorology (పుణె)
- NIOT- National Institute of Ocean Technology (చెన్నై)
- INCOIS- Indian National Centre for Ocean Information Services
- ప్రయోగించిన 18.46 నిమిషాల తర్వాత నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది
- పెరిజీ – 170 కి.మీ
- అపోజీ- 36,647 కి.మీ GSLV-F4 రాకెట్ గురించి..
- ఎత్తు- 51.7 మీటర్లు
- బరువు- 420 టన్నులు
- దశలు- 3 (S139+ L40+ CUS15)
- స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్రయోజెనిక్ ఇంజిన్‌తో ఈ రాకెట్ ప్రయోగం చేయడం ఇది 10వ సారి. మొత్తంగా 16వ ప్రయోగం. 12వ విజయం
ఇప్పటివరకు ఇస్రో చేసిన ప్రయోగాలు (ఫిబ్రవరి 17, 2024 నాటికి)
- స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్రయోజెనిక్ ఇంజిన్‌తో పని చేస్తున్న 7వ రాకెట్
- GSLV-MK II ను 2001 నుంచి ఉపయోగిస్తున్నారు
- స్పేస్ క్రాప్ట్ మిషన్లు- 124
- లాంచ్ మిషన్లు – 96
- ప్రైవేటు సంస్థలు లేదా విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహాలు-17
- విదేశీ ఉపగ్రహాలు- 432 (34 దేశాలకు చెందినవి)
- ఇస్రో సౌకర్యంతో ప్రయోగించినది- 1
- రీ-ఎంట్రీ మిషన్స్- 6
SHAR నుంచి చేసిన ప్రయోగాలు (ఫిబ్రవరి 17, 2024 నాటికి)
- మొత్తం ప్రయోగాలు- 93
- PSLV రాకెట్లు – 60
- GSLV రాకెట్లు – 16
- LVM3 రాకెట్లు – 7
- SSLV రాకెట్లు – 2
- ASLV రాకెట్లు- 4
- SLV రాకెట్లు- 4 ఉన్నాయి
Space Craft
- భూమి నుంచి అంతరిక్షంలోకి విభిన్న అవసరాల కోసం యాత్రలను నిర్వహించే వాహనం Space Craft.
- వీటిని ముఖ్యంగా భూమి చుట్టూ నిర్ధారిత కక్ష్యల్లో పరిభ్రమించడానికి, చంద్రుడి మీదకు ప్రయోగించడానికి ఇతర గ్రహాల అన్వేషణలో ఉపయోగిస్తారు.
ఉదా: చంద్రయాన్, చంద్రయాన్-2, చంద్రయాన్-3, మంగళయాన్ మొదలైనవి - భూమి గురుత్వాకర్షణ పరిధిని దాటి ప్రయాణించడానికి దానికి అధిక బలాన్ని అందించాల్సి ఉంటుంది. దీన్ని వాహక నౌక ద్వారా అందిస్తారు.
కక్ష్య
- అంతరిక్షంలోని ఒక వస్తువు గురుత్వాకర్షణ కారణంగా మరొక వస్తువు చుట్టూ వక్రమార్గంలో నిరంతరం పరిభ్రమించే పథం.
- జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్- (భూ అనువర్తన బదిలీ కక్ష్యలు)
- భూమి నుంచి ఉపగ్రహాలను ప్రయోగ వాహక నౌకల్లో అంతరిక్షంలోకి ప్రయోగించే క్రమంలో ఉపగ్రహాలు ఎప్పుడూ వాటి తుది కక్ష్యలో నేరుగా ప్రవేశపెట్టబడవు.
- బదులుగా ఉపగ్రహాలను వాటి నిర్ధారిత కక్ష్యల కంటే దిగువన ఉండే ఒక బదిలీ కక్ష్యలోకి ప్రయోగిస్తారు. అక్కడి నుంచి వాటిలోని Liquid Apogee Motor/LAM వంటి అంతర్నిర్మిత మోటార్లను మండించి ఉపగ్రహం లేదా అంతరిక్ష నౌక ఒక కక్ష్య నుంచి దాని పైనున్న మరొక కక్ష్యలోకి కదిలేలా చేస్తారు. ఈ విధంగా బదిలీ కక్ష్యల నుంచి వాటి నిర్దేశిత కక్ష్యలకు పంపడాన్ని ‘కక్ష్యా పెంపు చర్యలు’ (Orbital Raising Manevvers) అంటారు.
తాన్న రవి ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్వికారాబాద్
91107 62187
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- GSLV-F4
- ISRO
- space craft
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

