న్యూఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో సీనియర్ అస్టింట్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 20 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. మొత్తం 53 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి ఎలక్ట్రానిక్స్, అఫీషియల్ లాంగ్వేజ్, ఫైనాన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైనవారు చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, లడఖ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 53
ఇందులో సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ 5, ఫైనాన్స్ 16, ఎలక్ట్రానిక్స్ 32 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీలో హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో హిందీలో పీజీ, బీకామ్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి 30 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: 2023, జనవరి 20
వెబ్సైట్: www.aai.aero