హరారే: ఇండియాతో జరగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 రన్స్ చేసి ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. అయితే లోయర్ ఆర్డర్లో జింబాబ్వే బ్యాటర్లు రాణించారు. ఇండియన్ బౌలర్లలో చాహర్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణలు చెరో మూడేసి వికెట్లు తీసుకున్నారు. జింబాబ్వే బ్యాటర్లలో రేజిస్ చకబావ 35, రిచర్డ్ గరావా 34 రన్స్ చేశారు. బ్రాడ్ ఇవాన్స్ 33 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు.