పదును తగ్గితే.. పెదవికి చేటు
పదాలు పలికే పెదాలు గులాబీరేకుల్లా మెరిసిపోతే అతివ అందం రెట్టింపు అవుతుంది. మోవిపై చిరునవ్వులు ఎప్పుడూ నిలవాలంటే... అధరాలను ఆక్రమించే పిగ్మెంటేషన్‌ను ఆమడ దూరం ఉంచాల్సిందే. పలువలువ పదును తగ్గించి, కళావిహీనంగా మార్చే పిగ్మెంటేషన్‌ను ఛేదించినప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయి.
పదాలు పలికే పెదాలు గులాబీరేకుల్లా మెరిసిపోతే అతివ అందం రెట్టింపు అవుతుంది. మోవిపై చిరునవ్వులు ఎప్పుడూ నిలవాలంటే… అధరాలను ఆక్రమించే పిగ్మెంటేషన్‌ను ఆమడ దూరం ఉంచాల్సిందే. పలువలువ పదును తగ్గించి, కళావిహీనంగా మార్చే పిగ్మెంటేషన్‌ను ఛేదించినప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయి. లిప్‌స్టిక్స్‌తో రంగులద్ది హంగులు చేరుస్తామంటే పెదవికి చేటు తప్పదు. ఇన్ఫెక్షన్లు పలకరించే ప్రమాదం ఉంటుంది. అలా కావొద్దంటే.. మధువులొలకబోసే పెదాల ఆరోగ్యం కోసం ఈ సలహాలు పాటించండి. విటమిన్ బి12, విటమిన్ డి లోపాల కారణంగానే పెదాలపై పిగ్మెంటేషన్ పెరుగుతుంది. ఇక విటమిన్ డి లోపం మొత్తం చర్మ రంగుని ఎఫెక్ట్ చేస్తుంది. బి12 తగ్గినప్పుడు మెలనిన్ సైతం పెరిగే ప్రమాదం ఉంది.
దీంతో పెదాలను రెగ్యులర్‌గా నాలుకతో తడుపుకోవడం చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల అధరాలపై ఉన్న చర్మం పొర సహజత్వం విచ్ఛిన్నమవుతుంది. ఫలితంగా పెదాలు పొడిబారుతుంటాయి. తడి తగ్గిందని తరచూ నాలుకతో తడమడం వల్ల.. సమస్య పెరుగుతుందే కానీ, తగ్గదు. దీన్నే లిప్ లిక్కర్స్ డెర్మటైటిస్ అంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. కెమికల్స్ లేని లిప్‌బామ్ పెదాలకు అప్లయ్ చేస్తూ ఉండాలి. నీరు సమృద్ధిగా తీసుకోవాలి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడే పెదాలూ ఆరోగ్యంగా ఉంటాయి. అప్పుడు పెదాలు పగలవు, వాటిని నాలుకతో తడమాల్సిన పనీ రాదు. విటమిన్ బి12 సమృద్ధిగా ఉండే పదార్థాలకు మీ డైట్లో చోటివ్వండి. విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కాసేపు గడపండి. ఇక నాణ్యమైన లిప్స్టిక్స్ మాత్రమే వాడాలి. సమస్య తీవ్రంగా ఉందనిపిస్తే సంబంధిత వైద్యుణ్ని సంప్రదించండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ రివ్యూ.. నేటి తరం ప్రేమ, పెళ్లి ఆలోచనలకు అద్దం పట్టే చిత్రం ఎలా ఉందంటే?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకోవడానికి అసలు కారణం ఇదే.. పదేళ్ల తర్వాత నిజం చెప్పిన దర్శకుడు సంపత్ నంది!
Varanasi | రాముడిగా మహేష్ బాబు.. ‘వారణాసి’లో రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా,అసలు ట్విస్ట్ ఇదే!
OTT Movies | ఈ శుక్రవారం ఓటీటీలో సందడి.. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Nandi Awards | నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 9 ఏళ్ల పురస్కారాలు ఒకేసారి, డిసెంబర్లో గ్రాండ్ ఈవెంట్!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

