మొత్తం వడ్డీ మాఫీ సాధ్యం కాదు: సుప్రీం కీలక తీర్పు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది బ్యాంకు రుణాలపై ఆరు నెలల మారటోరియం విధించిన విషయం తెలుసు కదా. ఈ కాలానికిగాను మొత్తంగా వడ్డీ మాఫీ చేయాలని, మారటోరియం కాలాన్ని పొడిగించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పు వెల్లడించింది. ఈ ఆరు నెలల కాలానికి రుణ గ్రహీతకు వడ్డీ మీద వడ్డీ వసూలు చేయరాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే సమయంలో మారటోరియం కాలాన్ని పొడిగించడం సాధ్యం కాదన్న కోర్టు.. మొత్తం వడ్డీ మాఫీ చేయడం కూడా కుదరదని తేల్చి చెప్పింది.
ఖాతాదారులకు, పెన్షనర్లకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయని, అలాంటప్పుడు బ్యాంకులు ఎలా రుణాలపై పూర్తిగా వడ్డీ మాఫీ చేస్తాయని కోర్టు ప్రశ్నించింది.జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కీలకమైన తీర్పు వెలువరించింది. ఆ ఆరు నెలల మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీ ఉండకూడదు. ఒకవేళ అలా సేకరించి ఉంటే వెంటనే రీఫండ్ చేయాలని తీర్పు వెలువరించే సందర్భంగా జస్టిస్ ఎంఆర్ షా స్పష్టం చేశారు.
వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ గతేడాది పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గతేడాది కరోనా కారణంగా మార్చి నుంచి ఆగస్ట్ 31 వరకు రుణాలపై మారటోరియం విధిస్తున్నట్లు మార్చి 27న ఆర్బీఐ ప్రకటించింది. ఈ ఆరు నెలల సమయంలో వడ్డీపై వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తే అది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, బ్యాంకుల ఆర్థిక వనరులకు పెద్ద దెబ్బ పడుతుందని ఆర్బీఐ వాదించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

