న్యూఢిల్లీ : కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోం కల్చర్ జోరందుకోగా రిమోట్ వర్కింగ్‌కు సంబంధించిన పలు వీడియోలు (Viral video) సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. ఇక లేటెస్ట్గా థియేటర్లో సినిమా చూస్తూ ల్యాప్‌టాప్‌పై ఓ వ్యక్తి వర్క్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమా చూసేందుకు వచ్చిన వారిలో ఒకరు ఈ ఘటనను రికార్డు చేశారు. ఇది బెంగళూర్‌లోని మూవీ థియేటర్‌కు సంబంధించిన క్లిప్‌గా భావిస్తున్నారు. ఈ వీడియోను బెంగళూర్ మళయాళీస్ అనే ఖాతా ఏప్రిల్ 10న ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా ఆరు లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. బెంగళూర్‌లో టెకీ లైఫ్ అని వీడియోలో రాసుకురాగా ఈ వీడియోను చూసిన వారందరూ ఇదే మాట అంటున్నారు.
Read More
Ponniyin Selvan-2 | మణిరత్నం పాదాలకు నమస్కరించిన ఐశ్వర్య రాయ్.. వీడియో వైరల్