Dhruva Natchathiram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) తాజా ప్రాజెక్ట్ ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్ట్ చేస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్గా నటిస్తోంది. ముందుగా వచ్చిన అప్డేట్స్ ప్రకారం ధ్రువ నక్షత్రం నవంబర్ 24 (నేడు)న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉంది. కానీ రిలీజ్ ఆలస్యం కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ గౌతమ్ మీనన్ వివరణ ఇచ్చారు.
క్షమించండి. నేడు ధ్రువ నక్షత్రం చిత్రాన్ని తెరపైకి తీసుకురాలేదు. మేము మా వంతు ప్రయత్నం చేశాం.. కానీ మాకు మరో ఒకటి లేదా రెండు రోజులు అవసరమనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్, సరైన స్క్రీన్లతో అందరికీ గొప్ప అనుభూతి అందించాలని ఆశిస్తున్నాను. మా సినిమాకు అందించిన సపోర్ట్ కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరికొన్ని రోజుల్లో మేము వస్తామని ట్వీట్ చేశారు. ఈ మూవీ నవంబర్ 30న థియేటర్లకు వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వస్తుండగా.. విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే ఇవ్వనున్నట్టు సమాచారం.
ఇప్పటికే రిలీజ్ చేసిన ధ్రువ నక్షత్రం పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విక్రమ్ హెలికాప్టర్ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన లుక్‌తో.. గౌతమ్ మీనన్ ఈ చిత్రంలో గూస్బంప్స్ తెప్పించే స్టైలిష్ యాక్షన్ సీన్లను పెట్టాడని క్లారిటీ వచ్చేస్తుంది. మరోవైపు విక్రమ్ సూట్‌కేస్ పట్టుకొని స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న లుక్‌ను విడుదల చేయగా..నెట్టింట హల్ చల్ చేస్తోంది.
విక్రమ్ సూపర్ స్టైలిష్ లుక్‌తో అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అందించబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన లుక్స్ చెబుతున్నాయి. ధ్రువ నక్షత్రం నుంచి లాంఛ్ చేసిన తమిళ, తెలుగు ట్రైలర్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మెడలో స్కార్ప్, స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ వేసుకున్న విక్రమ్ చేతిలో పిస్తోల్ పట్టుకొని అగ్రెసివ్‌గా కనిపిస్తున్న లుక్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
ముంబై దాడులు జరిగినప్పుడు అక్కడికి ఎన్ఎస్జీ హెలికాప్టర్ రావడం బాగా ఆలస్యమైంది.. అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలైన ధ్రువ నక్షత్రం ట్రైలర్.. సినిమా అతి ముఖ్యమైన మిషన్ నేపథ్యంలో సాగనున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ మూవీలో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదువోం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు
#DhruvaNatchathiram #DhruvaNakshathram pic.twitter.com/dmD4ndEnp9
— Gauthamvasudevmenon (@menongautham) November 23, 2023
ధ్రువ నక్షత్రం స్టైలిష్ యాక్షన్ లుక్..
The Relentless Action Execution!
In just 5 Days, John & his Team will take on the centre stage❤🔥#DhruvaNakshathramFromNov24 #DhruvaNakshathram @chiyaan @menongautham @Jharrisjayaraj @riturv @OndragaEnt @oruoorileoru @Preethisrivijay @SonyMusicSouth @GskMedia_PR… pic.twitter.com/XpkzICWuri
— BA Raju’s Team (@baraju_SuperHit) November 19, 2023
సూపర్ స్టైలిష్‌గా విక్రమ్..
#DhruvaNatchathiram – New poster..🔥 #ChiyaanVikram‘s Stylish Action Thriller is Finally gonna see the lights next week..🤙 pic.twitter.com/cLTxeXYU63
— Laxmi Kanth (@iammoviebuff007) November 17, 2023
ధ్రువ నక్షత్రం తాజా పోస్టర్..
A Pulsating Tale packed with High-Octane Action.
Meet at the Basement in 8 Days 💥 #DhruvaNatchathiramFromNov24 #DhruvaNakshathramFromNov24 #DhruvaNatchathiram #DhruvaNakshathram@chiyaan @menongautham @Jharrisjayaraj @riturv @OndragaEnt @Preethisrivijay @SonyMusicSouth… pic.twitter.com/pZcQLam0xs
— Oruoorileoru Film House (@oruoorileoru) November 16, 2023
ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్..
ధ్రువ నక్షత్రం తమిళ్ ట్రైలర్..
ధ్రువ నక్షత్రం టీజర్ ..
కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్..