ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఓటేసిన మోదీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బూత్‌లో ఆయన ఓటేశారు. ఎంపీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, విపక్షాల అభ్యర్థిగా మార్గరేట్ అల్వాలు పోటీపడుతున్నారు. అయితే ధన్కర్ ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనున్నది. 780 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. దీంట్లో 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అయితే 36 మంది తృణమూల్ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నారు. రాజ్యసభలో 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో 744 మంది ఎంపీలు ఓటు వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన ఉద్దవ్ పార్టీలు మార్గరేట్ అల్వాకు మద్దతు ఇస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

