అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లు
భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. భారత పర్యాటకులు, నిపుణులైన కార్మికులు, విద్యార్థుల కోసం అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లను ప్రారంభిస్తున్నట్టు భారత్లోని అమెరికా ఎంబసీ ప్రకటించింది.
- భారతీయులకు అమెరికా శుభవార్త
న్యూఢిల్లీ: భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. భారత పర్యాటకులు, నిపుణులైన కార్మికులు, విద్యార్థుల కోసం అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లను ప్రారంభిస్తున్నట్టు భారత్లోని అమెరికా ఎంబసీ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇటీవల కొత్త స్లాట్లను విడుదల చేశామని, అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వేలమంది భారతీయులు సకాలంలో ఇంటర్వ్యూలను పొందేందుకు ఇవి ఎంతో దోహదం చేయడంతోపాటు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నది. వరుసగా రెండో ఏడాది కూడా 10 లక్షల వలసేతర (నాన్-ఇమ్మిగ్రెంట్) వీసా దరఖాస్తులను అధిగమించామని, ఇప్పుడు కుటుంబాలను, వ్యాపారులను కలపడంతోపాటు పర్యాటకాన్ని సులభతరం చేయడంపై దృష్టి సారించామని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. కాగా, ఈ ఏడాది ఇప్పటికే 12 లక్షల మందికిపైగా భారతీయులు అమెరికా వెళ్లారు. ఈ సంఖ్య నిరుటి కంటే 35% అధికం. మరోవైపు వరుసగా నాలుగో ఏడాది భారత విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలను మంజూరు చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

