దేవాదాయ భూముల రక్షణకు చర్యలు : ఎమ్మెల్యే సునీత

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధిపై దృష్టి సారించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా దేవాదాయ శాఖ భూములు, ఇతర అంశాలపై ఎమ్మెల్యే సునీత మాట్లాడారు. గత ప్రభుత్వాల పాలనలో దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జాకు గురయ్యాయి. ఇప్పుడు దేవాదాయ భూములను కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ర్టంలోని దేవాలయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్నారు.
దీప దూప నైవేద్యాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. ఈ పథకం కింద పూజారులకు రూ. 6 వేలు ఇస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని దేవాలయాల అభివృద్ధి జరుగుతుందన్నారు. నిత్యం స్వామికి వారికి కైంకర్యాలు చేసేవారికి, ఇతర పూజారులకు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా జీతాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు.
యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. భవిష్యత్‌లో యాదాద్రి గొప్ప కట్టడంగా మారనుందని ఆమె పేర్కొన్నారు. మూడు సంవత్సరాల కాలంలోనే యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

