Trent Boult | సూర్య.. నువ్వు అచ్చం నా లెక్కనే ఆడుతున్నావు : కివీస్ క్రికెటర్
భారత జట్టు స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అచ్చం తనలానే ఆడుతున్నాడని న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ జోక్ చేశాడు. యూఏఈ లీగ్‌లో బౌల్ట్ నెట్ ప్రాక్టీస్‌లో భారీ షాట్ ఆడాడు. 'ఓ సూర్యకుమార్' అని గట్టిగా అరిచాడు.
Trent Boult : భారత జట్టు స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి న్యూజిలాండ్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతను అచ్చం తనలానే ఆడుతున్నాడని బౌల్ట్ జోక్ చేశాడు. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్‌లో ఆడుతున్న బౌల్ట్ నెట్ ప్రాక్టీస్‌లో భారీ షాట్ ఆడాడు. అనంతరం ‘ఓ సూర్యకుమార్’ అని గట్టిగా అరిచాడు. ఆ వీడియోను ఎంఐ ఎమిరేట్స్ ఇన్స్టాగ్రామ్లోషేర్ చేసింది. ఆ వీడియో చూసిన సూర్య ‘వాట్ ఏ ప్లేయర్’ అని కామెంట్ చేశాడు. అందుకు బౌల్ట్ సరదాగా స్పందించాడు. ‘సూర్యకుమార్ కొన్నేళ్లుగా నువ్వు అచ్చం నాలానే ఆడుతున్నావు’ అని కామెంట్ చేశాడు.
ఎలిమినేటర్ మ్యాచ్ కోసం..
యూఏఈ లీగ్‌లో బౌల్ట్ ఎంఐ ఎమిరేట్స్ జట్టుకు ఆడుతున్నాడు. దుబాయ్ క్యాపిటల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు రోజు అతను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. భారీ షాట్ ఆడిన అనంతరం అది సిక్స్ వెళ్లిందా? అని బౌలర్‌ను అడిగాడు. అతను అవును అని చెప్పడంతో బౌల్ట్ ‘నైస్ సూర్యకుమార్’ అని పెద్దగా అన్నాడు. అంతేకాదు ఆ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ‘ఈ షాట్ ఎలా ఉంది?’ అని సూర్యకుమార్‌ను అడిగాడు.
ఐపీఎల్లో ఒకే జట్టుకు
సూర్యకుమార్, బౌల్ట్.. ఇద్దరూ ఐపీఎల్లో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు. ఈ స్టార్ ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి ఆడారు. టీ20ల్లో నంబర్ 1 బ్యాటర్ అయిన సూర్య బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. తొలి టెస్టు వేదిక అయిన నాగ్‌పూర్‌లో అతను డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

