Open Air Theatre | ఇష్టమైంది తింటూ నచ్చిన మూవీ చూస్తూ.. నగరంలో ఓపెన్ ఎయిర్ థియేటర్స్‌కు భలే క్రేజ్
చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం.. చల్లని గాలి.. చేతిలో ఇష్టమైన ఫుడ్.. మనసుకు నచ్చిన సినిమా.. అదీ అతిపెద్ద స్క్రీన్‌పై.. ఆహా..ఆ కిక్కే వేరు కదా.. ఇలా నగరవాసులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి ఓపెన్ ఎయిర్ థియేటర్లు.
- రెస్టారెంట్స్,కేఫ్‌లలో సినిమా వేదికలు
- వీకెండ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న నగరవాసులు
చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం.. చల్లని గాలి.. చేతిలో ఇష్టమైన ఫుడ్.. మనసుకు నచ్చిన సినిమా.. అదీ అతిపెద్ద స్క్రీన్‌పై.. ఆహా..ఆ కిక్కే వేరు కదా.. ఇలా నగరవాసులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి ఓపెన్ ఎయిర్ థియేటర్లు. ముఖ్యంగా వీకెండ్స్‌లో కొన్నిరెస్టారెంట్లు, కేఫ్‌లలో ఈ తరహా థియేటర్లు అందుబాటులో ఉండగా, రూ. 400 నుంచి 500 మధ్య టికెట్ ధరలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా ఓపెన్ ఎయిర్ థియేటర్స్‌లో సినిమా చూడటం గొప్పగా ఉంటోందని ప్రేక్షకులు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు.
సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): ఇష్టమైన ఫుడ్ తింటూ.. పచ్చిక బయళ్లలో చల్లని పిల్లగాలులు వీస్తుండగా ఆకాశ పందిరి కింద బిగ్ స్క్రీన్‌పై సినిమాను చూడాలని ఎవరు మాత్రం కోరుకోరు. అలాంటి మధురానుభూతిని సినీ ప్రియులకు అందించేందుకు ఇప్పుడు హైదరాబాద్ నగరం వడివడిగా దూసుకెళ్తున్నది. నేడు నగరంలో పలు ఓపెన్ ఎయిర్ థియేటర్స్ సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీకెండ్స్‌లో ఈ ఓపెన్ ఎయిర్ స్క్రీన్స్ అందుబాటులో ఉంటున్నాయి. కాగా, ఒక్కరికి రూ.400 నుంచి 500 మధ్య టికెట్ ధరలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా ఓపెన్ ఎయిర్ థియేటర్స్‌లో సినిమా చూడటం గొప్ప అనుభూతిని పంచుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు.
ఇవిగో వేదికలు..
ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ట్రెండ్ నగరంలో జోరందుకుంటున్నది. గత ఫ్రిబవరిలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొన్ని కేఫ్‌లో ఆ ఒక్క రోజు సినిమాలు ప్రదర్శించాయి. దీనికి అమోఘమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అలాంటి వెన్యూలను రెస్టారెంట్స్, కేఫ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. నగరంలో ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో వన్ గోల్ఫ్ బ్రేవెరీలో సన్‌సెట్ సినిమా క్లబ్ ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలో ఫెలికాలాంజ్ పెట్ ఫ్రెండ్లీ కేఫ్‌లోనూ ఉంది. అమీర్‌పేటలోని కార్నర్ సుండాఈలో అందుబాటులో ఉంది. రెగ్యూలర్ షోలు నడిపించడానికి ఈ సంస్థ యోచిస్తున్నది.

Hyd11
ఓటీటీ దాటుకుని..
ఇప్పుడంతా ఓటీటీ. చాలా వరకు సినిమా థియేటర్స్‌కు వెళ్లి చూడటం నగరవాసులు తగ్గించేశారు. వారం, రెండు వారాల్లో కొత్త సినిమాలో ఇంటి తెరలపై స్క్రీనింగ్ అవుతుండటంతో వారికి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరం అంతగా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఓపెన్ ఎయిర్ థియేటర్ కాన్సెప్ట్ సక్సెస్ అయింది. చాలా మంది ఐటీ ఉద్యోగులు వీకెండ్లో ఇలా ఓపెన్ ఎయిర్ థియేటర్లో సినిమాలు చూస్తూ సందడి చేస్తున్నారు. ఓపెన్ ఎయిర్ థియేటర్ మూవీలను చూడటానికి నగరవాసులు చూపిస్తున్న ఆసక్తితోనే రెగ్యులర్ షోలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని సంబంధిత కంపెనీ ఓ సంస్థ మార్కెటింగ్ మేనేజర్ శివంగిని తెలిపారు.
సరికొత్త అనుభూతి
ఓపెన్ ఎయిర్‌లో సినిమా చూడటం కొత్త అనుభూతినిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అనుభూతిని ఆస్వాదించాలి. మేం వీకెండ్లో హిందీ మూవీ చూశాం. మనకు నచ్చిన ఫుడ్ తింటూ సినిమా చూడటం గొప్పగా ఉంటుంది. ఎటు చూసినా ఓపెన్ ప్లేస్. వీకెండ్లో ఇలా ఔట్‌డోర్ సినిమా చూడటం కూడా ఇప్పుడు మా యాక్టివిటీలో భాగమైంది.
-మధు, సాఫ్ట్వేర్ ఉద్యోగి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్ జోన్ పరిధిలో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మొత్తం 63 మంది ఉద్యోగులకు వివిధ ఉన్నత హోదాల్లో పదోన్నతులు కల్పిస్తూ హైదరాబాద్ జోన్ ఈడీ ఖుశ్రో షా ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. .జూనియర్ క్లర్క్ ( ఫైనాన్స్)గా పదోన్నతి పొందిన వారిలో 23 మంది కండక్టర్లు, ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు ఆఫీసర్లు (RCs), . జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్)గా 27 మంది కండక్టర్లు పదోన్నతి పొందారని వివరించారు.
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

