The Red Bag | ఆ ‘రెడ్ బ్యాగ్’కి అమ్మాయిలకి ఉన్న సంబంధం ఏంటి..? హైప్ పెంచుతోన్న టీజర్
The Red Bag | లైఫ్‌లో ఇన్వైట్ చేయని గెస్టులు చాలా మంది వస్తుంటారు.. వచ్చి మన లైఫ్‌ని మార్చేస్తారు.. ఆ గెస్ట్ మనిషే అవ్వాల్సిన అవసరం లేదు.. మనల్ని పరుగెత్తించి, ఇబ్బంది పెట్టి చావు వరకు తీసుకెళ్లి వదిలిపెట్టే ఆ పిలవని అతిథి అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో షురూ అయింది టీజర్.
The Red Bag | టాలీవుడ్ విలన్, హర్యానా యాక్టర్ కబీర్ దుహన్ సింగ్ లీడ్ రోల్లో నటిస్తోన్న మూవీ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag). రవికుమార్ సీరపు కథ, స్క్రీన్‌ప్లేతోపాటు దర్శకత్వం వహస్తున్నాడు. రాశీ కీలక పాత్ర పోషిస్తుంది. రాధ్య, స్నేహా సింగ్, ఆకాంక్ష ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి ప్రసాద్ బెహరా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా మేకర్స్ లాంచ్ చేసిన టీజర్ మూవీ లవర్స్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది.
లైఫ్‌లో ఇన్వైట్ చేయని గెస్టులు చాలా మంది వస్తుంటారు.. వచ్చి మన లైఫ్‌ని మార్చేస్తారు.. ఆ గెస్ట్ మనిషే అవ్వాల్సిన అవసరం లేదు.. మనల్ని పరుగెత్తించి, ఇబ్బంది పెట్టి చావు వరకు తీసుకెళ్లి వదిలిపెట్టే ఆ పిలవని అతిథి అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో షురూ అయింది టీజర్. ఓ రెడ్ బ్యాగ్ వల్ల నలుగురు అమ్మాయిల జీవితం ఎలా తలకిందులు అయింది.. అసలు ఆ రెడ్ బ్యాగ్‌లో ఏముంది..? ఆ బ్యాగ్‌కి అమ్మాయిలకి ఉన్న సంబంధం ఏంటి..? ఆ రెడ్ బ్యాగ్‌తో మాఫియాకి ఉన్న లింక్ ఏంటి..? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా కట్ చేసిన టీజర్‌ను సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది.
కొన్ని పాత్రలు కేవలం కథకు సపోర్ట్‌గా నిలుస్తాయి. కానీ సావిత్రి మాత్రం మొత్తం ఆటనే మార్చేస్తుంది.. అంటూ మేకర్స్ రాశీ పాత్రను పరిచయం చేశారని తెలిసిందే. మరోవైపు మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ది రెడ్ బ్యాగ్ మూవీ ప్రీ లుక్‌లో నలుగురు అమ్మాయిలతో రిలీజ్ చేసిన పోస్టర్‌తో బ్యాగ్ చుట్టూ తిరిగే కథాంశంతో సాగే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. ఇంతకీ ది రెడ్ బ్యాగ్ కథేంటో సినిమా చూస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Read Also :
Maa Inti Bangaram | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’.. రెండు రోజుల్లో రూ.25 కోట్లకు పైగా వసూళ్లు!
Baahubali Docuseries | ‘బాహుబలి’ తెరవెనుక కథ.. జూన్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ సిరీస్
Tandur | తాండూర్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

