Spain | హైదరాబాద్, జూలై 6 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): స్పెయిన్ ప్రభుత్వం ‘పోర్న్ పాస్‌పోర్ట్’ను కొత్తగా తీసుకొచ్చింది. 18 ఏండ్ల పైబడిన వారికి మాత్రమే పోర్న్ సైట్లలో ప్రవేశాన్ని కల్పించడానికి దీన్ని తీసుకొచ్చారు. డిజిటల్ వాలెట్ బీటాగా పిలుస్తున్న ఈ పోర్న్ పాస్‌పోర్టును 18 ఏండ్లు పైబడిన వారికి అందిస్తారు.
ఈ పాస్‌పోర్ట్ కింద నెలకు 30 పోర్న్ క్రెడిట్స్‌ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. వీటితో పోర్న్ సైట్లను వీక్షించవచ్చు. క్రెడిట్స్ ఖర్చయిపోతే, అదనపు క్రెడిట్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని కూడా ఉచితంగానే అందిస్తారు. అశ్లీల మాధ్యమాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించడం, పోర్న్ వ్యసనాన్ని తగ్గించడం, ఆన్లైన్ లైంగిక వేధింపుల కట్టడి కోసమే పోర్న్ పాస్‌పోర్ట్‌ను తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు.