IPL 2023 : ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ చెలరేగింది. ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌పై అనూహ్యంగా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండోసారి ముంబైపై పై చేయి సాధించింది. ఇషాన్ కిషన్(59) హాఫ్ సెంచరీతో మెరుపులు, టిమ్ డేవిడ్(32 నాటౌట్) ధనాధన్ ఆడడంతో రోహిత్ సేన అవలీలగా గెలుస్తుందనిపించింది. కానీ, లక్నో బౌలర్లు విజృంభించి ముంబైని 172 కట్టడి చేశారు. ఏడో విజయంతో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది.
లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్(59) రోహిత్ శర్మ(37) శుభారంభం ఇచ్చారు. రవి బిష్ణోయ్ వరుస ఓవర్లలో వీళ్లను పెవిలియన్ పంపాడు. గత మ్యాచ్‌లో సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్(7)ను యశ్ ఠాకూర్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత నేహల్ వధేర(16), ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన విష్ణు వినోద్(2) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.
ఇషాన్ కిషన్(59)
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్(89 నాటౌట్ 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) దంచి కొట్టాడు. అర్ధ శతకంతో లక్నోకు పోరాడే స్కోర్ అందించాడు. రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన కృనాల్ పాండ్యా(49) అతడికి సహకారం అందించాడు. దాంతో, లక్నో వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. టాస్ ఓడిన లక్నోకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన దీపక్ హుడా (5) విఫలయ్యాడు. బెహ్రన్‌డార్ఫ్ ఒకే ఓవర్లో హుడా, ప్రేరక్ మన్కడ్(0)ను ఔట్ చేశాడు. క్వింటన్ డికాక్(16) కూడా తక్కువకే వెనుదిరిగాడు. కష్టాల్లో పడిన లక్నోను స్టోయినిస్, కృనాల్ పాండ్యా ఆదుకున్నారు. వీళ్లు నాలుగో వికెట్‌కు 78 రన్స్ జోడించారు.