ఆలోచన ఆచరణ ఆదాయం

గడిచిన 20 నెలల్లో కరోనా మహమ్మారి ప్రభావంతో మనలో చాలామంది ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఇకపై ఈ మహమ్మారితో సహజీవనం తప్పదని నిపుణులూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రమశిక్షణతో, పద్ధతిగా మదుపు చేయడం వల్ల మహమ్మారి మరోసారి మన జీవితాలను కమ్మేసినా నిలబడవచ్చు. అందుకోసం ఈ కొత్త సంవత్సరంలో తెలివిగా ఆలోచించి.. ఆ ఆలోచనలను ఆచరణలో పెడితే.. ఆకర్షణీయమైన ఆదాయం మీదే.

ఆర్థిక లక్ష్యాలు
అందరికీ కలలుంటాయి. వాటిని చేరుకోవాలంటేనే ప్రణాళిక అవసరం. సంపదను పెంచుకోవడం, రుణాల ఊబి నుంచి బయటపడటం, పిల్లల ఉన్నత చదువు, విదేశీ విద్య, సొంతిల్లు, వ్యాపారం, సంతోషకరమైన వృద్ధాప్య జీవితం.. ఈ కలలన్నీ సాకారం కావాలంటే కావల్సిందల్లా ప్రణాళికే మరి. ఈ ఆశలు.. లక్ష్యాలు.. అందరికీ ఒకేలా ఉండొచ్చు. కానీ అందరి ఆదాయాలు ఒకేలా ఉండవు. అలాగే ప్రణాళికలోనూ తేడాలుంటాయి. అయితే మీ లక్ష్యాలు మీకే సొంతం. వాటిని చేరుకోవడానికి మీరు అనుసరించే వ్యూహం మరొకరితో పోల్చుకోలేం. అందుకే ఆ లక్ష్యాలను, ప్రాధాన్యతలనుబట్టే జాబితా తయారు చేయండి. వాటిని చేరుకోవడానికి పక్కాగా ప్రయత్నించండి.

సరైన అంచనా
మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళిక ఒక్కటే సరిపోదు. ఆ ప్రణాళిక మీ ఆదాయ వనరులకు తగ్గట్టుగానే ఉండాలి. అప్పుడే సత్ఫలితాలు వస్తాయి. మీరు చేరుకోవాలనుకున్న లక్ష్యాలకు, మీ వనరులకు పొంతన లేకపోతే సాధించలేం. వచ్చే ఆదాయంలో ఎంత పెట్టుబడిగా పెట్టగలం అన్నది ముందుగా అంచనా వేయండి. శక్తికి మించి వేసే అంచనాలు మనల్ని కుంగదీస్తాయి. నెలవారీ ఆదాయంలో ఖర్చులను తీసివేయగా, మిగిలిన దానిలో ప్రణాళిక ప్రకారం ఎంత మదుపు చేయగలరో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

రిస్క్ మదింపు
ప్రతీ ఇన్వెస్ట్మెంట్లోనూ రిస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మొత్తం జీరో కావచ్చు. అందుకని మనం ఎంత రిస్క్‌ను తీసుకోగలమో అంచనా అవసరం. రిస్క్‌కు తగ్గట్టుగా చేసే పెట్టుబడులు.. అనూహ్యంగా వచ్చే నష్టాలనూ ఓర్చుకునేలా చేస్తాయి. అత్యధిక రాబడి వచ్చే పెట్టుబడుల్లో.. రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుందన్న విషయం మరువరాదు. అందుకే మదుపు చేసే ముందే రిస్క్‌ను అంచనా వేయండి. అంచనా లేకపోతే రుణ భారం ఉన్నా.. లేదా మన ఆదాయంలో సగానికిపైగా ఆర్థికపరమైన ఆబ్లిగేషన్లలో ఉన్నా.. రిస్క్‌ను భరించే శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మన సామర్థ్యం, రిస్క్‌ను భరించే శక్తినిబట్టే ప్రణాళికలు వేయండి.
లక్ష్యాలకు గడువు
ఎంచుకున్న లక్ష్యాల సాధనకు గడువు అనేది ఎంతో ముఖ్యం. గడువు లేని లక్ష్యం వ్యర్థమే. అందుకే లక్ష్యాల జాబితా.. వాటిని చేరుకోవడానికి ప్రణాళికాబద్ధమైన గడువులు నిర్ణయించండి. వాటికి తగ్గట్టుగా మీ ఆలోచనలు, పెట్టుబడులను అమలు చేయండి. ఉదాహరణకు వచ్చే రెండేండ్లలో కారును కొనాలనుకుంటే అందుకు తగ్గట్టుగా నిధులను పోగేయడం మొదలుపెట్టండి. ఆ తర్వాత మరో లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. అయితే ఆర్థిక భారం మరింత పెరిగేలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే లక్ష్యచేధన కష్టతరమవుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Evaluation
- investments
- Risk
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం


