హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగా ణ): సినీ నటుడు సోనూసూద్ మరోసారి దాతృత్వాన్ని చాటుకొన్నారు. ఏపీలోని చిత్తూ రు జిల్లా గుడుపల్లి మండలం అత్తినతం గ్రామానికి చెందిన సాల మ్మ అనే పేద మహిళ తీవ్ర అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నది. సాయం కోసం సోనూసూద్ ఫౌండేషన్‌ను ఆశ్రయించింది. గుడుపల్లి మండలానికి చెందిన ఫౌండేషన్ సభ్యుడు పురుషోత్తం విషయాన్ని సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సమకూర్చారు. మారుమూల ప్రాంతం లో ఉన్న తన సమస్యను తెలసుకొని సాయం అందించిన సోనూసూద్‌కు సాలమ్మ కృతజ్ఞతలు తెలిపారు.