కోతులకు సోలార్ షాక్
- దెబ్బకు పారిపోతున్న వానరాలు
- ప్రాణం పోదు.. పంటకు నష్టం రాదు
- ఒక యూనిట్‌కు పదెకరాల సామర్థ్యం
- 15 ఏండ్ల వారంటీ ఇస్తున్న కంపెనీలు

లింగాల ఘనపురం, డిసెంబర్ 15: రైతులంతా ఇప్పుడు కూరగాయలు, ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. వారికి ఉన్న సమస్యల్లా.. కోతుల బెడదే. ఒక్కసారి వానరాల గుంపు చేనులోకి దిగిందంటే పంటనంతా నాశనం చేస్తాయి. ఇప్పటిదాకా కోతుల సమస్యకు కొండెంగలు, పులి, సింహాల బొమ్మలే పరిష్కారం అనుకొన్నాం. ‘సోలార్ ఫెన్సింగ్’తోనూ వాటిని తరిమికొట్టవచ్చు. అందుకు సోలార్ యూనిట్, సోలార్ జట్కా స్టార్టర్, ఒక బ్యాటరీ, 16 గేజ్ వైర్ ఉంటే సరిపోతుంది. ఒక్కసారి ఫెన్సింగ్‌కు రూ.15 వేలకు మించి ఖర్చు కాదు.
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడెంకు చెందిన ఆముదాల సంతోష్‌రెడ్డి ఈ పద్ధతితో కోతుల బెడదకు చెక్ పెట్టారు. ఎంటెక్ చదివిన ఈ యువరైతు ఉద్యోగాన్ని వదిలి తనకున్న ఏడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. కోతుల భయం ఉన్నదని తెలిసి, సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటుచేశారు. సోలార్ ఫెన్సింగ్ కోసం.. యూనిట్‌కు రూ.7 వేలు, బ్యాటరీకి రూ.4 వేలు, వైరుకు రూ.2 వేలు, కూలీలకు రూ.1,500.. మొత్తం దాదాపు రూ.15 వేలు ఖర్చు చేశానని చెప్పారు. ఫెన్సింగ్ తీగలను కోతులు తాకగానే షాక్‌కు గురై పారిపోతున్నాయని, ఇప్పటి వరకు ఒక్క కోతి కూడా చనిపోలేదని, ఒక యూనిట్‌తో పది ఎకరాలకు రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సోలార్ ఫెన్సింగ్‌తో ఉపయోగాలు
- తక్కువ ఖర్చు
- సులభంగా ఏర్పాటు
- ఎక్కువ కాలం మన్నిక
- ఆపరేటింగ్ ఖర్చు ఉండదు
- జంతువులు, మనుషులకు నష్టం ఉండదు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

