భారత్‌లో శాంసంగ్ టీవీ ప్లస్ లాంచ్.. 100% ఉచితం

గురుగ్రామ్: సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ టీవీ ప్లస్ ఓటీటీ వీడియో స్ట్రీమింగ్ సేవలను భారత్‌లో బుధవారం ప్రారంభించింది. శాంసంగ్ తన స్మార్ట్‌టీవీల కోసం సేవలను తీసుకురాగా ప్రస్తుతం 15 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉపయోగిస్తున్నారు. సెట్ టాప్ బాక్స్ లాంటి అదనపు డివైజ్‌లు ఏవీ లేకుండానే ఎంపిక చేసిన ఛానెళ్లు, ఆన్ డిమాండ్ వీడియోలను వీక్షించొచ్చు. సేవలను వినియోగించుకోవాలంటే శాంసంగ్ స్మార్ట్ టీవీ(2017 మోడల్ నుంచి), ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
O ఓఎస్(ఆపరేటింగ్ సిస్టమ్) లేదా అప్డేటెడ్ సాఫ్ట్వేర్ వెర్షన్ ఉన్న శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లలో కూడా టీవీ ప్లస్ యాప్ అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ స్మార్ట్ఫోన్లలో ఈ సేవలు ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి. టీవీ ప్లస్ యాప్‌ను శాంసంగ్ గెలాక్సీ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 15 మిలియన్లకు పైగా యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు. ఈ సేవలను 100% ఉచితంగానే వినియోగించుకోవచ్చు.
ఇప్పటి వరకు కంపెనీకి చెందిన స్మార్ట్‌టీవీల్లో మాత్రమే ఈ సర్వీసులు అందుబాటులో ఉండగా ఏప్రిల్ నుంచి గెలాక్సీ ఫోన్లలో కూడా లభిస్తుందని పేర్కొంది. భారత్‌లో లాంచ్‌తో శాంసంగ్ టీవీ ప్లస్ మొత్తం 14 దేశాల్లో అందుబాటులోకి వచ్చినట్లైంది. భవిష్యత్‌లో అన్ని కొత్త శాంసంగ్ టీవీలు, స్మార్ట్ఫోన్లలో డిఫాల్ట్‌గా టీవీ ప్లస్ రానుంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ తదితర ఓటీటీల మాదిరిగా పెయిడ్ సబ్స్క్రప్షన్లు, తప్పనిసరిగా డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను శాంసంగ్ టీవీ ప్లస్‌లో నమోదు చేయాల్సిన అవసరం లేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

