Samantha | దుబాయ్ వీడియోతో మరోసారి తమ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన సమంత.. ఇక త్వరలోనే పెళ్లి
Samantha | టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత ఏమాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయం కాగా, తన తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా జెస్సీగా తన నటనతో యూత్ ఫేవరెట్‌గా కూడా మారింది.
Samantha | టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత ఏమాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయం కాగా, తన తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా జెస్సీగా తన నటనతో యూత్ ఫేవరెట్‌గా కూడా మారింది. ఈ సినిమా తర్వాత సమంతకి వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రావడం, వచ్చిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. సమంత హీరోల సినిమాల్లో నటించడమే కాకుండా యాక్షన్ చిత్రాలు, లేడీ ఓరీయెంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకుంది. అడపాదడపా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ సత్తా చాటుతుంది.
కొంతకాలంగా సమంత-రాజ్ నిడిమోరు జంట ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ మధ్య రాజ్‌తో సమంత సన్నిహితంగా కనిపించడం, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడం, ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్లో కలిసి హాజరవడం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందనే అభిప్రాయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం సమంత భుజంపై రాజ్ చేయి వేసి నడవగా, మరో ఫొటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యాపీ మూడ్‌లో కనిపించారు. కట్ చేస్తే ఈ జంట ఒకే కారులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఇప్పుడు దుబాయ్‌లో ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. డిజైనర్ క్రేషా బజాజ్ ఫ్యాషన్ షో దుబాయ్ లో జరుగుతుండగా.. దానికి సామ్ హాజరైంది. ఇందుకు సంబంధించిన వీడియోను సామ్ అభిమానులతో పంచుకుంది.
దుబాయ్ ట్రిప్ ను ఒక్క నిమిషంలో చూపిస్తున్నా అంటూ సమంత షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని సమంత సందడి చేసింది. అయితే ఆ వ్యక్తి కచ్చితంగా రాజ్ నే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.ఈ మధ్య ఇన్‌డైరెక్ట్‌గా తమ రిలేషన్ గురించి హింట్స్ ఇస్తుందని నెటిజన్స్ అంటున్నారు. సామ్ – రాజ్ రిలేషన్ చాలా దూరం వెళ్లిందని, త్వరలోనే త్వరలోనే వారి రెండో పెళ్లి అంటూ జోస్యాలు చెబుతున్నారు. ప్రస్తుతం సమంత “మా ఇంటి బంగారం” అనే చిత్రంతో పాటు, ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను రాజ్ & డీకేలు తెరకెక్కిస్తుండగా, ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బీ వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

