ధర్మశాల: ఉక్రెయిన్, రష్యాకు చెందిన ఓ జంట.. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఆ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే హిమచల్ప్రదేశ్లోని ధర్మశాలలో ఉంటున్న ఆ జంట గత ఏడాది కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. రష్యాకు చెందిన సెర్గీ నొవికోవ్.. ఉక్రెయిన్ అమ్మాయి ఎలోనా బ్రమోకాలు సనాతన హిందూ ధర్మ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ధర్మశాలలోని దివ్య ఆశ్రమంలో ఈ వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లి సోషల్ మీడియాలో సెన్షేషన్ క్రియేట్ చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ ఉన్న నేపథ్యంలో ఈ పెళ్లి ప్రత్యేకత సంతరించుకున్నది. స్థానికులు ఈ పెళ్లికి హాజరైన డ్యాన్సులు చేశారు. అతిథులకు కంగ్రి థామ్ సంప్రదాయ భోజనాన్ని కూడా పెట్టారు.
#WATCH | Himachal Pradesh: Sergei Novikov, a Russian national tied the knot with his Ukrainian girlfriend Elona Bramoka in a traditional Hindu ceremony in Dharamshala on August 2. pic.twitter.com/0akwm2ggWr
— ANI (@ANI) August 5, 2022