16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి!
- అమెరికాకు అందిన నిఘా సమాచారం
వాషింగ్టన్, ఫిబ్రవరి 12: ఈనెల 16న ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు రష్యా ప్రణాళికలు వేసుకున్నదని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆక్రమణకు సంబంధించిన ప్లాన్ అమెరికా సీక్రెట్ సర్వీస్ సీఐఏ, రక్షణ శాఖకు అందిందని జర్మన్ పత్రిక డెర్ స్పీగెల్ నివేదించింది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో శనివారం ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. నాటో మిత్రదేశాలతో అమెరికా ప్రభుత్వం రహస్య చర్చలు జరిపిందని డైలీ మెయిల్ తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దుకు రష్యా పెద్ద ఎత్తున సైన్యాన్ని తరలించింది. ఇదే సమయంలో బెలారస్లో జరుగుతున్న సైనిక విన్యాసాలకు కూడా బలగాలను పంపింది.
అమెరికా దౌత్య సిబ్బం ది వెనక్కు
ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న వార్తల నేపథ్యంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయాలని యోచిస్తున్నది. ఉక్రెయిన్ విడిచి రావాలని తమ పౌరులను బైడెన్ ఇదివరకే కోరారు. మరోవైపు, మరో 3 వేల మంది బలగాలను ఉక్రెయిన్ పొరుగు దేశమైన పొలాండ్‌కు అమెరికా తరలించనుంది. ఇప్పటికే అక్కడ 1,700 మంది అమెరికా సైనికులు ఉన్నారు. జర్మనీలో ఉన్న వెయ్యి మంది అమెరికా సైనికులను కూడా రొమేనియాకు పంపుతున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

