అమెరికన్ యోధులతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ నేతృత్వంలో యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన షూట్ జరుగుతుండగా, పతాక సన్నివేశాలలో భీకర పోరాటం కోసం అమెరికా నుండి 40 మంది యోధులు ఇండియాకి వస్తున్నారు.
40 మందితో జక్కన్న చిత్రీకరించే క్లైమాక్స్ సీన్ ప్రేక్షకుల సరికొత్త వినోదాన్ని పంచుతుందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 1947 స్వాతంత్య్రానికి పూర్వం జరిగే హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనుండగా, చరణ్.. అల్లూరి సీతారామరాజు గా సందడి చేయనున్నారు. బ్రిటీష్ వారిపై పోరాటం చేసేందుకు ఈ ఇద్దరు యోధులు చేతులు కలపనున్నట్టు మూవీలో చూపించనున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో అజయ్ దేవ్ గన్అ,లియా భట్, ఒలివియా మోరిస్,రే స్టీవెన్సన్,అలిసన్ డూ,సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ ప్రాజెక్టును రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- jt ntr
- ram charan
- rrr movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

