ఎన్నికల సభకు భారీ ఎలుగుబంటితో..

కాలిఫోర్నియా: రిపబ్లికన్ పార్టీ తరఫున కాలిఫోర్నియా గవర్నర్ గిరీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న జాన్ కాక్స్ ఎన్నికల ర్యాలీకి ఎలుగుబంటిని తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. బ్యూటీ అండ్ ద బీస్ట్ థీమ్‌తో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హాలివుడ్ పురిటిగడ్డ అయిన కాలిఫోర్నియాకు అమెరికాలో రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా, అత్యధిక ఆదాయం సంపాదించే రాష్ట్రంగా కాలిఫోర్నియా అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం డెమొక్రాటిక్ గవర్నర్‌గా గావిన్ న్యూసమ్ ఉన్నారు. ఆయనను పదవి నుంచి తప్పించాలని కాక్స్ డిమాండ్ చేస్తున్నారు. మద్యంతర ఎన్నికలు జిరిపితే గవర్నర్ పదవి చేపట్టాలని కాక్స్ ఆకాంక్ష. గవర్నర్ గావిన్‌ను బ్యూటీగా, తనను తాను బీస్ట్ గా అభివర్ణించుకుంటున్నారాయన. కాలిఫోర్నియా రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తానని కాక్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గావిన్‌ను తొలగించడం సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు. ఎందుకంటే ప్రజల్లో డెమొక్రాట్ల పట్ల మద్దతు ఇదివరకటి కంటే ఎక్కువే ఉంది. ప్రస్తుతం కాక్స్ డిమాండ్ కు పరిస్థితులు అనుకూలంగా లేవు.. ఇదంతా జరిగేపని కాదని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా తన ప్రచారం ధాటిగా ఉండాలని కాక్స్ ఓ పెంపుడు ఎలుగుబంటిని వేదిక మీదకు తెచ్చి ఇలా హంగామా చేశారు. 500 కిలోల బరువుండే భారీ కొడియాక్ జాతి ఎలుగుబంటి కిక్కురుమనకుండా వేదిక మీద కూర్చుని తమాషా కలిగించింది. కాక్స్ ప్రచారం కూడా అంతే తమాషాగా మిగిలిపోతుందని అంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

