రాగి హల్వా
స్టవ్‌మీద కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యివేసి, వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో స్పూన్ నెయ్యివేసి రాగి పిండి, ఉప్మా రవ్వ వేసి పచ్చివాసన పోయేంతవరకూ సన్నని మంటపై వేయించాలి.
కావలసిన పదార్థాలు
రాగి పిండి: ఒక కప్పు, ఉప్మా రవ్వ: పావు కప్పు, బెల్లం: ఒక కప్పు, నెయ్యి: అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, డ్రై ఫ్రూట్స్ (కాజూ, బాదం, పిస్తా): పావుకప్పు.
తయారీ విధానం
స్టవ్‌మీద కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యివేసి, వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరో స్పూన్ నెయ్యివేసి రాగి పిండి, ఉప్మా రవ్వ వేసి పచ్చివాసన పోయేంతవరకూ సన్నని మంటపై వేయించాలి. స్టవ్ మీద మరో పాన్ పెట్టుకుని రెండు కప్పుల నీళ్లలో బెల్లం వేసి కరిగించాలి. కరిగిన బెల్లాన్ని రాగిపిండి మిశ్రమంలో పోసుకుని ఉండలు కట్టకుండా కలుపుతూ.. కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ.. దగ్గరపడేవరకు బాగా ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి దించుకుంటే సరి. వేడివేడి రాగి హల్వా సిద్ధం. కావాలంటే నెయ్యి రాసిన పళ్లెంలో పరిచి, చల్లారాక ముక్కలుగానూ కోసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

