అభివృద్దికి ఆధ్యుడు పీవీనే… మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ముషీరాబాద్: పలు సంస్కరణలు తీసుకువచ్చి కష్టాల్లో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన ఘనత మాజీ ప్రధానీ పీవీ.నరసింహారావుకే దక్కిందని దేవాదాయ శాఖ మంత్రి ఐ ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. దేశం ఎంతగానో అభివృద్ది చెందడానికి పీవీ బాటలు వేశారని అన్నారు. బుధవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో సర్వార్థ సంక్షేమ సమితి 29 వ వార్షికోవ వేడుకలు, పీవీ శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పలువురు వేద పండితులను ఘనంగా సత్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో త్వరలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అర్చకులు, వేద పండితులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని, దూపదీప నైవేద్యాలకు ఆరువేలు ఇస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త పీవీ మనోహర్‌రావు రచించిన సమర్పణం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యాశంకర భారతీ స్వామి, ఎమ్మెల్సీ వాణిదేవి, పీవీ ప్రభాకర్‌రావు, గంగాధర శాస్త్రి, వెంకటరమణ శర్మ, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, మదన్మోహన్రావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

