పునీత్ కలల ప్రాజెక్ట్

కన్నడ అగ్రకథానాయకుడు పునీత్‌రాజ్‌కుమార్ ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన హఠాన్మరణం తాలూకు విషాదం నుంచి కుటుంబసభ్యులు, అభిమానులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. సోమవారం పునీత్ రాజ్‌కుమార్ నటించిన కన్నడ డాక్యుమెంటరీ ‘గంధగుడి’ ట్రైలర్‌ను విడుదలచేశారు. కర్ణాటక అటవీ సంపదను సంరక్షించుకోవాలనే సందేశంతో పునీత్‌రాజ్‌కుమార్ కలల ప్రాజెక్ట్‌గా ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. స్వీయ నిర్మాణ సంస్థ పీఆర్కే ప్రొడక్షన్స్ పతాకంపై ఆయనే దీనిని నిర్మించారు. కర్ణాటక అడవులు, జలపాతాలు, ప్రకృతి అందాలను చూపిస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఇందులో పునీత్ ైస్టెలిష్‌గా కనిపించారు. అమోఘవర్ష ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. ‘గంధదగుడి’ పేరుతో 1973లో దిగ్గజ నటుడు రాజ్‌కుమార్ ఓ సినిమా చేశారు. తండ్రి టైటిల్‌ను పునీత్‌రాజ్‌కుమార్ ఎంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తున్నది. త్వరలో ఈ డాక్యుమెంటరీ విడుదలకానుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

