రావణుడితో పోరుకు సిద్ధం
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’. సుధీర్‌వర్మ దర్శకుడు. ఈ సినిమాలో యువ హీరో సుశాంత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే భారీ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఇందులో రవితేజ, సుశాంత్ పాల్గొన్నారు. శుక్రవారం సుశాంత్ జన్మదినం. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ స్టిల్‌లో ఆయన పొడవాటి జుట్టు, గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘రోమాంచితమైన యాక్షన్ థ్రిల్లర్ ఇది. రవితేజ, సుశాంత్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయి. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తారు’ అని చిత్రబృందం తెలిపింది. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీశర్మ, సంపత్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, నిర్మాణ సంస్థలు: అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్, దర్శకత్వం: సుధీర్‌వర్మ.
సుశాంత్ వెబ్‌సిరీస్ అరంగేట్రం
ప్రస్తుతం అగ్ర హీరోలు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. వినూత్న కథాంశాలతో ప్రయోగాలు చేసే వీలుండటంతో సినిమాలతో పాటు ఓటీటీ వేదికల్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా హీరో సుశాంత్ కూడా ఓటీటీలో అరంగేట్రం చేస్తూ ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. జీ5 తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్నది. కొల్లా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కు లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుశాంత్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. తన కెరీర్లో ఇదొక విభిన్నమైన ప్రయాణమని సుశాంత్ ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

