Prem Kumar Movie Trailer | మిలియన్ వ్యూస్ దాటిన ప్రేమ్ కుమార్ ట్రైలర్.. అన్నీ హాల్లోనే
Prem Kumar Movie Trailer | బోలెడంత టాలెంట్, చక్కటి రూపం, కష్టపడే తత్వం ఈ మూడింటితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండి ఉంటే సంతోష్ శోభన్ రేంజ్ వేరేలా ఉండేంది. ఇండస్ట్రీకి వచ్చి పుష్కర కాలం అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క థియేట్రికల్ హిట్టు కొట్టలేకపోయాడు సంతోష్ శోభన్. ప్రస్తుతం సంతోష్ ఆశలన్నీ ప్రేమ్ కుమార్ సినిమాపైనే ఉన్నాయి. అభిషేక్ మహర్షి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కాబోతుంది.
Prem Kumar Movie Trailer | బోలెడంత టాలెంట్, చక్కటి రూపం, కష్టపడే తత్వం ఈ మూడింటితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండి ఉంటే సంతోష్ శోభన్ రేంజ్ వేరేలా ఉండేంది. ఇండస్ట్రీకి వచ్చి పుష్కర కాలం అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క థియేట్రికల్ హిట్టు కొట్టలేకపోయాడు సంతోష్ శోభన్ (Santhosh Shoban). ప్రస్తుతం సంతోష్ చేస్తున్న తాజా చిత్రం ప్రేమ్ కుమార్ (Prem Kumar Movie). అభిషేక్ మహర్షి(Abhishaik Maharshi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏడాది క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది కానీ.. పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఎట్టకేలకు ఆగస్టు 18న విడుదల కాబోతుంది.
ఈ మేరకు చిత్రయూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేస్తు్న్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్‌కు పైగా వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటిస్తూ.. “ఈ ప్రేమ్ కుమార్ (Prem Kumar Movie) వ్యధను చూసి కనెక్ట్ అయిన 1 మిలియన్ ప్రేక్షకులకు ధన్యవాదములు. ఇంకా ఆగష్టు 18 నుంచి అన్నీ హాల్లోనే అంటూ” ట్విట్టర్లో రాసుకొచ్చారు.
ప్రేమ్ కుమార్ ట్రైలర్‌తో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది చిత్రబృందం. పెళ్లి కోసం పాట్లు పడే పాత్రలో సంతోష శోభన్ కనిపించబోతున్నాడు. పీటల దాకా వచ్చిన సంతోష్ పెళ్లిళ్లన్ని ఆగిపోతుంటాయి. దీంతో విసుగెత్తిపోయిన సంతోష్ ఒక బిజినెస్ పెడతాడు. బ్రేకప్, పెళ్ళికి ముందు అవసరమైన ఇన్వెస్టిగేషన్, కావాలంటే మూడు ముళ్ళు పడకముందే వాటిని ఆపేయడం ఇలా అన్ని సర్వీసులు ఇస్తాడు. కొన్ని రోజుల్లోనే పెళ్లిళ్లను చెడగొట్టడంలో స్పెషలిస్ట్ గా పేరు సంపాదించుకుంటాడు. అదే సమయంలో క్లయింట్ గా వచ్చిన హీరోయిన్ తో సంతోష్ లవ్ లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ సారైనా సంతోష్ పెళ్లి జరిగిందా? అనే వాటికి జవాబు దొరకాలంటే థియేటర్లో బొమ్మ చూడాల్సిందే.
ట్రైలర్ మొత్తం ఫన్ యాంగిల్ లోనే సాగింది. కంటెంట్ కూడా కొత్తగానే ఉంది. అన్ని కరెక్ట్ గా కుదిరితే మాత్రం ఈ సారి సంతోష్ హిట్టు కొట్టినట్లే. అయితే ఈ సినిమాకు వారం రోజుల ముందు భోళా శంకర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా దాని ప్రభావం ఖచ్చితంగా వారం రోజులు ఉంటుంది. అదీ కాకుండా వైష్ణవ్ తేజ్ ఆదికేశవ అదే రోజు రిలీజ్ కానుంది. ఇప్పటివరకైతే ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు కానీ.. సితార సంస్థ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ప్రమోషన్లు గట్రా బాగా చేసి ఓవర్ నైట్ లో హైప్ తీసుకురాగలరు. మరీ ఈ మామా అల్లుళ్ల పోటీని తట్టుకుని సంతోష నిలబడతాడో లేదో చూడాలి.
శారంగ ఎంటర్టైన్మెంట్స్ (Sharanga Entertainments) పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు(Shiva prasad Panniru) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్ (Rashi Singh), రుచిత (Ruchitha) సాధినేని కథనాయికలుగా నటిస్తున్నారు. కృష్ణ చైతన్య (Krishna Chaitanya), కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Ee @PremKumarPelli Vyadha ni chusi connect aina 1 MILLION prekshulaki, dhanyavadhamulu! ❤️
Inka Aug 18th nunchi annii hall lo ne!! #PremKumar#WhereIsPK
▶️ https://t.co/Dk64zvYlXa@santoshsoban @abhimaharshi1 @shiva6111 @RashiReal_ @cerebrahma @SharangaOffl @adityamusic pic.twitter.com/JEvlNNdeXJ
— Vamsi Kaka (@vamsikaka) July 19, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

